Weight Loss Drinks: కేవలం 10 రోజుల్లో శరీర బరువు తగ్గించే జీలకర్ర - సొంపు మిశ్రమం

అధిక బరువు తగ్గించుకోవడానికి లక్షల ఉపాయాలను పాటించడం కన్నా జీలకర్ర మరియు సొంపులతో ఒక సహజ డిటాక్స్ జ్యూస్ తాగితే చాలు..  కేవలం 10 రోజుల్లో మీ శరీర బరువు తగ్గటమే కాకుండా.. మీ శరీరం డిటాక్స్ కూడా అవుతుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 9, 2023, 07:51 PM IST
Weight Loss Drinks: కేవలం 10 రోజుల్లో శరీర బరువు తగ్గించే జీలకర్ర - సొంపు మిశ్రమం

Weight Loss Drinks: బరువు ఎలా తగ్గాలి అని అడిగితే..  అందరు ఇచ్చే సలహా.. ఎక్కువగా సార్లు తినాలి మరియు తాగాలి. కానీ సహాజ సిద్ధంగా బరువు తగ్గాలంటే.. సహజసిద్దమైన డిటాక్స్ డ్రింక్స్ శరీరంలోని అధిక బరువుని తగ్గిస్తాయి. ఈ విషయం మీకు తెలియదా.. ? తెలియకపోతే ఈరోజు తెలుసుకుందాం.

సరైన డైట్ ని అనుసరించే వరకు శరీరంలోని కొవ్వు అస్సలు తగ్గదు.శరీర బరువును నిజంగా తగ్గించుకోవాలి అనుకునే వారు మరియు అందంగా, స్లిమ్ గా అవ్వాలి అనుకునే వారు ప్రతిరోజు జీలకర్ర -  సోంపు కలిపిన నీటిని తాగాలి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేసే జ్యూస్  మరియు పూర్తిగా సహజమైనది. ఈ జ్యూస్ తాగి చాలా మంది తమ శరీర బరువు తగ్గించుకున్నారు. 
ఈ జీలకర్ర - సోంపు జ్యూస్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. 

జీవక్రియని మెరుగుపరుస్తుంది  
జీవక్రియ లేదా మెటబాలిజం అనేది మన శరీరం యొక్క ఒక రసాయన ప్రక్రియ. శరీర బరువు తగ్గడానికి లేదా పెరగడానికి ఇదే ముఖ్య కారణం. ఎందుకంటే ఇది శరీరంలోని కెలోరీలను వేగంగా తగ్గించడంలో సహాయపడుతుంది.రోజు మంచి అల్పాహారం, భోజనం తీసుకోవడం వల్ల జీవక్రియ స్థాయి సాధారణంగా ఉంటుంది.దీని ద్వారా కేలరీలను తగ్గించుకోవడంలో ఉపయోగపడుతుంది. జిమ్ యాక్టివిటీస్, సైక్లింగ్ మరియు వాకింగ్ చేయడం ద్వారా బరువు తొందరగా తగ్గుతారు. 

Also Read: Orange Benefits: అధిక బరువుకు చెక్ చెప్పాలంటే ఈ ఫ్రూట్ రోజూ తాగితే చాలు

జీర్ణ వ్యవస్థ  
మెరుగైన జీర్ణ క్రియ వ్యక్తి యొక్క ఆరోగ్య స్థితిని తెలియజేస్తుంది. బరువుని తగ్గించుకోవడానికి పరిమితంగా ఆహారాన్ని తీసుకోవడం, జీర్ణక్రియని మెరుగుపరచుకోవడం ఎంతో అవసరం. ఎందుకంటే తిన్న ఆహరం జీర్ణక్రియ సహాయంతో శరీరం అంతటా శక్తి రూపంలో  వ్యాపిస్తుంది. మెరుగైన జీర్ణక్రియ వల్ల శరీరంలో రక్త స్థాయి స్థిరంగా ఉండటమే కాకుండా.. రక్తపోటు మరియు బరువు నియంత్రణలో ఉంటాయి.   

శరీరాన్ని డిటాక్స్ చేయడం  
ఉదయం లేవగానే సహజ సిద్దమైన పండ్ల రసాలను తాగడం ఎంతో అవసరం. ఎందుకంటే అవసరం కంటే ఎక్కువగా ఆహారాన్ని తీసుకుంటే మన శరీరంలో జీర్ణక్రియ తగ్గుతుంది. దీని వల్ల శరీరంలో వ్యర్ధాల నిల్వ జరిగి శరీర బరువు పెరుగుతుంది.ఈ ప్రక్రియ జరిగే సమయంలో రక్తం మురికిగా మారుతుంది.దీని వల్ల చర్మ సమస్యలు మరియు అనేక వ్యాధులు కలిగే ప్రమాదం ఉంటుంది. కావున శరీరాన్ని డిటాక్స్ చేస్తూ ఉండడం మంచిది.

Also Read: Dates Benefits: మధుమేహం వ్యాధిగ్రస్థులు ఖర్జూరం తినవచ్చా లేదా, వాస్తవమేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News