Dinner Time Mistakes: రాత్రి సమయంలో మీరు చేసే ఈ 5 తప్పులే బరువు పెరగడానికి అసలు కారణం..

Dinner Time Mistakes for weight gain: ఈ మధ్యకాలంలో అతిబరువుతో ఎక్కువ మంది బాధపడుతున్నారు. వెయిట్ లాస్ అవ్వడం అంత సులభం కాదు. అయితే, మనం బరువు పెరగకుండా ఉండడానికి కొన్ని చర్యలు తీసుకోవాలి.

Written by - Renuka Godugu | Last Updated : May 30, 2024, 03:13 PM IST
Dinner Time Mistakes: రాత్రి సమయంలో మీరు చేసే ఈ 5 తప్పులే బరువు పెరగడానికి అసలు కారణం..

Dinner Time Mistakes for weight gain: ఈ మధ్యకాలంలో అతిబరువుతో ఎక్కువ మంది బాధపడుతున్నారు. వెయిట్ లాస్ అవ్వడం అంత సులభం కాదు. అయితే, మనం బరువు పెరగకుండా ఉండడానికి కొన్ని చర్యలు తీసుకోవాలి. మంచి డైట్, లైఫ్ స్టైల్, నిద్ర లేమి ఇవన్నీ బరువు పెరగడానికి అసలైన కారణాలు. బ్రేక్ఫాస్ట్ సమయం నుంచి రాత్రి భోజనం కొరకు మీరు తీసుకునే ఆహారం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. మన జీవితంలో రాత్రి భోజనం ఎంతో ముఖ్యం అయితే, తీసుకునే ఆహారం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా మీరు రాత్రి సమయంలో కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. దీనివల్ల బరువు విపరీతంగా పెరిగిపోతారు. రాత్రి సమయంలో జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది. అందుకే హెవీ మీల్స్ తినకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ మొత్తంలో ఒకేసారి తీసుకోకుండా కొద్ది మొత్తంలో ఎక్కువసార్లు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అయితే రాత్రి పడుకునే ముందు ఎలాంటి పనులకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం.

భోజనం స్కిప్ చేయడం..
కొంతమంది రాత్రి సమయంలో భోజనం తినకుండా అలాగే పడుకుంటారు. అయితే ఇలా చేయడం వల్ల కూడా బాడీ మెటమాలిజం రేటు పై ప్రభావం పడుతుంది. ఆరోగ్య సమస్యలు వస్తాయి. మీరు భోజనం చేయకుంటా ఉండే బదులు సమతుల ఆహారం తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి. బరువు తగ్గడానికి రాత్రి సమయంలో భోజనం తినకుండా ఉంటే ఇది ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

ఇదీ చదవండి:  చల్ల చల్లని చందనం ఫేస్ ప్యాక్.. చంద్రబింబం లాంటి గ్లోయింగ్..

భోజనం రాత్రి సమయంలో ఎక్కువ మొత్తంలో తింటారు. అది కూడా లేట్ నైట్ తినడం వల్ల ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం బరువు పెరగకుండా ఉంటారు. నిద్ర సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.కార్బోహైడ్రేట్స్ కూడా ఒక సమతుల ఆహారంలో ఒక భాగం అయితే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ మోతాదులో ఉండే ఆహారాలు రాత్రి సమయంలో తీసుకోకూడదు.ఈ ఆహారాలు బరువు పెరగడానికి కారణం అవుతాయి.  సమతుల ఆహారం ఉండే కూరగాయలు వంటి ఆహారాలు మీ డిన్నర్నల్లో చేర్చుకోండి.

ఇదీ చదవండి:  కొబ్బరినూనెలో ఈ ఒక్కటి కలిపి అప్లై చేయండి.. మీ జుట్టు వద్దన్నా పెరుగుతూనే ఉంటుంది..

బరువు పెరగకుండా ఉండటానికి రాత్రి భోజనంలో ఫ్రైడ్ చేసిన ఆహారాలు తీసుకోకుండా దూరంగా ఉండాలి. అంతేకాదు ప్రాసెస్ చేసిన ఆహారాలు కూడా తీసుకోకూడదు. ఇది జీర్ణ ఆరోగ్యం పై ప్రభావం చూటమే కాదు, అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఇందులో కొవ్వులు, ఉప్పు ఎక్కువ మోతాదులో ఉంటాయి. అంతేకాదు క్యాలరీలు కూడా ఉంటాయి. గ్రిల్ చేసిన వాటికంటే ఉడికించిన ఆహారాలు తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ఈ సమయంలో ఇంట్లో చేసుకున్న ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి. మీరు తీసుకునే ఆహారం ప్లేట్ కూడా చిన్నగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ మోతాదులో ఒకేసారి తినడం వల్ల బరువు అతిగా పెరిగిపోతారు. చిన్న మొత్తంలో ఎక్కువ సార్లు తినడానికి ప్రాధాన్యత ఇవ్వండి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News