Diabetes Control Food: చలికాలంలో మార్కెట్లలో ఆకు కూరలు పుష్కలంగా లభిస్తాయి. అందుకే చాలా మంది శీతాకాలంలో తరచుగా ఆకు కూరలను తీసుకుంటారు. అయితే వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు శరీరానికి కలుగుతాయి. ముఖ్యంగా వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల కడుపునొప్పి, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అయితే ఈ క్రమంలో చాలా మందిలో మధుమేహం సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాకుండా తీవ్ర షుగర్ వ్యాధులతో బాధపడుతున్నవారు తీవ్ర అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ క్రమంలో ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గించే పలు రకాల ఆకు కూరలను తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మధుమేహం ఉన్నవారు ఈ ఆకు కూరలను తినండి:
1. భారతదేశంలో ప్రస్తుతం శీతాకాలం కొనసాగుతోంది. ఈ క్రమంలో మార్కెట్‌లో బచ్చలికూరను సులభంగా లభిస్తుంది. పాలకూరలో ఫైబర్, పాలీఫెనాల్స్, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభించి రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి.
2. చలికాలంలో క్యాబేజీకి కూడా విచ్చల విడిగా లభిస్తుంది. కాబట్టి వీటిని మధుమేహంతో బాధపడుతున్నవారు క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా దీనిని సూప్‌ల్లో వినియోగించడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు సులభంగా తగ్గుతాయి.
3. కాలే అనేది క్యాబేజీ సంతతికి చెందిన ఆకు కూర. అయితే దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి ఫైబర్ పుష్కలంగా లభించి జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాబట్టి మధుమేహంతో బాధపడే వారు తప్పకుండా దీనిని ఆహారంలో తీసుకోండి.
Also Read : Waltair Veerayya Song Shoot : విదేశాల్లో చిరుతో రొమాన్స్.. మిడ్ ఫింగర్ చూపించిన శ్రుతి హాసన్
Also Read : Waltair Veerayya: వాల్తేరు వీరయ్య నుంచి వీడియో లీక్ చేసిన చిరు.. మాములుగా లేదుగా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook