Dandruff Removing Tips: ఈ చిట్కాలతో 8 రోజుల్లో జుట్టులో చుండ్రు మాయం!

Dandruff Home Remedies: చుండ్రు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. వాటిని పాటించడం వల్ల సులభంగా జుట్టు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 1, 2023, 11:13 AM IST
Dandruff Removing Tips: ఈ చిట్కాలతో 8 రోజుల్లో జుట్టులో చుండ్రు మాయం!

Dandruff Removing Tips: మారుతున్న సీజన్‌ కారణంగా చాలా మందిలో చుండ్రు సమస్యలు వస్తూ ఉంటాయి. జుట్టును తాకగానే తల నుంచి చుండ్రు రాలడం మొదలవుతుంది. చుండ్రు సమస్య మీ స్కాల్ప్ నుండి సెబమ్‌ను పీల్చుకునే ఫంగస్ వల్ల వస్తుంది.  దీని కారణంగా జుట్టులో చుండ్రు పెరగడం ప్రారంభమవుతుంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో లభించే పలు రకాల రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్‌ను వినియోగించకుండా పలు రకాల ఇంటి చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి చిట్కాలను పాటించడం వల్ల సులభంగా చుండ్రు సమస్యల నుంచి బయటపడొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

చుండ్రు తొలగించడానికి ఇంటి చిట్కాలు:
1. జుట్టుకు అస్సలు నూనె రాసుకోవద్దు:

 జుట్టులో చుండ్రు సమస్యలతో బాధపడేవారు జుట్టుకు ఎలాంటి నూనె రాసకోవద్దని నిపుణులు చెబుతున్నారు. జుట్టు నూనె అప్లై చేయడం వల్ల ఈ సమస్య రెట్టింపు అయ్యే ఛాన్స్‌ ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే నూనె రాయడం ఆపడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

2. మురికి దువ్వెనను ఉపయోగించవద్దు:
చుండ్రు సమస్యతో బాధపడేవారు అస్సలు మురికి దువ్వేనతో దూయకూడదని నిపుణులు అంటున్నారు. ఇలా ఒక వేళా దూస్తే దువ్వెన మురికి జుట్టుకు అంటుకుని రెట్టింపు సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.

3. వ్యాయామం తర్వాత జుట్టును శుభ్రం చేయాలి:
ప్రతి రోజూ వ్యాయామాలు చేసేవారు తప్పకుండా జుట్టుకు చెమట పట్టిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే సులభంగా చుండ్రు సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.

4. జుట్టును శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం:
చుండ్రును సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా జుట్టును క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం మీరు జింక్ పైరిథియోన్ ఆధారిత షాంపులు లేదా ఆయుర్వేద షాంపులు వినియోగించడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

5. క్యాప్‌ అస్సలు పెట్టొద్దు:
ఎండలో బయటకు వెళ్లే క్రమంలో టోపీని ఎక్కువసేపు ధరించవద్దని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలా కప్పి ఉంచడం వల్ల చాలా రకాల జుట్టు సమస్యలు దారీ తీసే ఛాన్స్‌ ఉంది.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read:  Anupama Parameswaran Saree pics : కొప్పున పూలెట్టుకొని.. అందమంటే అనుపమదేనా?.. చీరకట్టుకే కళ వచ్చిందా?

Also Read: Amala Akkineni : కుక్కల మీద అలాంటి కామెంట్లు చేసిందా?.. అమల నిజంగానే అలా అనేసిందా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News