Curd Rice: చలికాలంలో పెరుగున్నం తింటే ఏమౌంతుందో తెలుసా?

Curd Rice Benefits: ప్రతి రోజు పెరుగు అన్నం తినడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు శరీర బరువును నియంత్రిస్తాయి. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుంది.     

Last Updated : Dec 6, 2024, 07:10 PM IST
Curd Rice: చలికాలంలో పెరుగున్నం తింటే ఏమౌంతుందో తెలుసా?

Curd Rice Benefits: ప్రతి రోజు పెరుగు అన్నం తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. ముఖ్యంగా ఇందులో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ B12, రిబోఫ్లావిన్ , ప్రోబయోటిక్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. అలాగే ప్రతి రోజు పెరుగన్నం తినడం వల్ల ఎముకలతో పాటు దంతాలు కూడా మెరుగుపడతాయి. ముఖ్యంగా జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారికి పెరుగన్నం ఎంతో సహాయపడుతుంది. అలాగే ఇతర అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రతి రోజు పెరుగన్నం తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి.

పెరుగు అన్నం తినడం వల్ల కలిగే లాభాలు:
జీర్ణ వ్యవస్థకు మేలు: 

పెరుగులో ప్రోబయోటిక్స్ అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యవంతంగా చేసేందుకు ఎంతో సహాయపడుతుంది. అంతేకాకుండా పేగులలోని మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. దీని కారణంగా జీర్ఱసమస్యలేవైన సులభంగా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

రోగ నిరోధక శక్తి : 
ఆరోగ్యవంతమైన ప్రోబయోటిక్స్  పెరుగన్నంలో ఎక్కువ మోతాదులో లభిస్తుంది. ఇది శరీర రోగ నిరోధక వ్యవస్థను దృఢంగా చేసేందుకు ఎంతో సహాయపడుతుంది. అంతేకాకుండా వివిధ వ్యాధుల నుంచి రక్షించేందుకు కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

ఎముకలు, దంతాలకు బలం: 
పెరుగు అన్నంలో కాల్షియంతో పాటు ఇతర పోషకాలు కూడా ఎక్కువ మోతాదులో లభిస్తాయి. కాబట్టి రాత్రి పడుకునే ముందు పెరుగన్నం తినడం వల్ల ఎముకలు స్ట్రాంగ్‌గా తయారవుతాయి. అంతేకాకుండా దంతాలు కూడా బలంగా తయారవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

బరువు నియంత్రణ: 
శరీర బరువును నియంత్రించేందుకు పెరుగన్నం ఎంతో సహాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గే క్రమంలో ప్రతి రోజు డైట్‌లో భాగంగా పెరుగన్నం తినడం ఎంతో మంచిది. అలాగే పెరుగన్నం తినడం వల్ల శక్తి కూడా విపరీతంగా పెరుగగుతుంది. కొవ్వు కూడా తగ్గుతుంది. 

ఇదీ చదవండి: ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి డూప్ గా నటించింది వీళ్లా.. ఫ్యూజలు ఎగిరిపోవడం పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News