Curd Hair Masks: పెరుగుతో మీ జుట్టుకు ఈ మాస్క్‌ వేయండి.. పొడవాటి మెరిసే జుట్టు మీ సొంతం..

Curd Hair Masks: పెరుగులో ప్రోబయోటిక్‌ ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన పేగు కదలికకు మంచిది అంటారు. అయితే, జుట్టుకు కూడా పెరుగు ఎన్ని ప్రయోజనాలు కలిగిస్తుందో తెలుసుకుందాం. 

Written by - Renuka Godugu | Last Updated : Jul 16, 2024, 10:35 AM IST
Curd Hair Masks: పెరుగుతో మీ జుట్టుకు ఈ మాస్క్‌ వేయండి.. పొడవాటి మెరిసే జుట్టు మీ సొంతం..

Curd Hair Masks: పెరుగును అనేక విధాలుగా ఉపయోగిస్తారు. దీంతో ఎన్నో ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు పెరుగును ఉపయోగిస్తారు. దీనివల్ల మీ జుట్టు ఆరోగ్యంగా మెరుస్తుంది. పెరుగు మీ జుట్టుకు మాయిశ్చర్‌ అందిస్తుంది. ఇది పొడిబారిన జుట్టుకు మంచి ప్రయోజనం చేకూరుస్తుంది. ముఖ్యంగా పెరుగులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టును బలంగా కూడా మారుస్తుంది. రక్తసరఫరాను మెరుగు చేస్తుంది. పెరుగులో ప్రోబయోటిక్‌ ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన పేగు కదలికకు మంచిది అంటారు. అయితే, జుట్టుకు కూడా పెరుగు ఎన్ని ప్రయోజనాలు కలిగిస్తుందో తెలుసుకుందాం. 

పెరుగు, కొబ్బరినూనె..
పెరుగు కొబ్బరినూనె కలిపి జుట్టుకు అప్లై చేయడం వల్ల  జుట్టు ఆరోగ్యంగా బలంగా పెరుగుతుంది. ఈ రెండిటినీ బాగా మిక్స్‌ చేసి హెయిర్‌ ప్యాక్ మాదిరి తయారు చేసుకోవాలి. ఓ అరగంట తర్వాత సాధారణ నీటితో హెయిర్‌ వాష్‌ చేయండి.

పెరుగు, ముల్తానీ మిట్టి..
పెరుగు, ముల్తానీ మిట్టి కలిపి హెయిర్‌ ప్యాక్‌ తయారు చేసుకోవాలి. ఇది కుదుళ్లను ఆరోగ్యవంతం చేస్తుంది. ఈ ప్యాక్‌ను జుట్టుకు అప్లై చేసి ఓ అరగంటపాటు అలాగే ఆరనివ్వండి ఆ తర్వాత సాధారణ నీటితో హెయిర్‌ వాష్‌ చేయాలి. దీంతో మీ జుట్టు బలంగా, ఆరోగ్యంగా పెరుగుతుంది.

ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

పెరుగు, మెంతులు..
మెంతులను నీటిలో రాత్రంతా నానబెట్టాలి. పెరుగు మెంతులను రెండిటినీ కలిపి రాత్రి నానబెట్టుకుని ఉదయం వాటిని హెయిర్‌ ప్యాక్‌ మాదిరి తయారు చేయాలి. ఈ పేస్ట్‌ను జుట్టు అంతటికీ పట్టించి ఆరనివ్వండి. జుట్టుకు ఓ అరగంటపాటు పెట్టుకోవాలి. ఆ తర్వాత సాధారణ నీటితో షాంపూ పెట్టి తలస్నానం చేసుకోవాలి.

తేనె..
తేనె పెరుగు రెండిటినీ కలిపి మీ జుట్టుకు అప్లై చేసుకోవచ్చు. దీంతో హెయిర్‌ మాస్క్‌ తయారు చేయాలి. ఓ అరగంట తర్వాత రెగ్యులర్‌ షాంపూతో తలస్నానం చేసుకుంటే సరిపోతుంది. తేనె జుట్టకు మాయిశ్చర్‌ అందిస్తుంది. జుట్టు పొడిబారడాన్ని తగ్గిస్తుంది.

ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!

ఉసిరి..
ఉసిరి పొడిని పెరుగులో వేసుకుని కూడా జుట్టుకు పట్టించాలి. ఈ పేస్ట్‌ను జుట్టు అంతటికీ పట్టించాలి. దీన్ని ఓ గంటపాటు అప్లై చేయాలి. ఆ తర్వాత నార్మల్‌ నీటితో జుట్టును కడగాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News