COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలనుకుంటున్నారా, వీరికి మాత్రమే టీకా ఇవ్వనున్నారని తెలుసా

COVID-19 Vaccination Latest News: 60 ఏళ్లు పైబడినవారు, 45 నుంచి 59 ఏళ్ల మధ్య ఉండి కేంద్రం జారీ చేసిన 20 వ్యాధులలో ఏదైనా ఒక సమస్య ఉన్నవారు కోవిడ్-19 టీకా తీసుకోవచ్చు. కోవిన్(Cowin) యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు

Written by - Shankar Dukanam | Last Updated : Mar 1, 2021, 06:24 PM IST
  • మార్చి 1 నుంచి దేశ వ్యాప్తంగా రెండో దశ కరోనా వైరస్ వ్యాక్సినేషన్
  • 60 ఏళ్లు పైబడిన అందరికీ కరోనా టీకాలు ఇవ్వనున్నట్లు తెలిపిన కేంద్రం
  • 45 నుంచి 59 వరకు వయసు వారిలో 20 వ్యాధులు ఏమైనా ఉంటే వ్యాక్సిన్
COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలనుకుంటున్నారా, వీరికి మాత్రమే టీకా ఇవ్వనున్నారని తెలుసా

COVID-19 Vaccination Latest News: నేడు దేశ వ్యాప్తంగా రెండో దశ కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. 60 ఏళ్లు పైబడినవారు, 45 నుంచి 59 ఏళ్ల మధ్య ఉండి కేంద్రం జారీ చేసిన 20 వ్యాధులలో ఏదైనా ఒక సమస్య ఉన్నవారు కోవిడ్-19 టీకా తీసుకోవచ్చు. కోవిన్(Cowin) యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. https://www.cowin.gov.in/ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలంటే ఈ కింది 20 వ్యాధుల వివరాలు తెలుసుకోండి. 45 నుంచి 59 ఏళ్ల వయసు వారికి ఈ లక్షణాలు ఉంటే రిజిస్టర్ చేసుకోండి. 

ఈ కింది 20 రకాల అనారోగ్య సమస్యలు ఉన్న వారిని వ్యాక్సిన్‌కు అర్హులుగా పరిగణిస్తారు
1. గుండె(Heart) సంబంధిత సమస్యలతో గత ఏడాదిలో ఆస్పత్రిలో చేరినవారు
2. కార్డియాక్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నవారు లేదా ఎడమ వెంట్రిక్యులర్ అసిస్ట్ డివైస్ (LVAD) ఉన్నవారు
3. ఎడమ వెంట్రిక్యులర్ సిస్టోలిక్ పనిచేయనివారు (LVEF 40 శాతం కన్నా తక్కువగా ఉండటం).
4. సాధారణ లేదా అతి తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు
5.  PAH కారణంగా పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు లేదా తీవ్రమైన PAH ఇడియోపతిక్ సమస్య 

Also Read: Corona Vaccination: ఈ వ్యాధులు ఉన్నాయా, అయితే COVID-19 Vaccine తీసుకునేందుకు అర్హులు అవుతారు
6. CABG లేదా PTCA లేదా MIతో కరోనరీ ఆర్టరీ సమస్య ఉన్నవారు మరియు హైపర్‌టెన్షన్, డయాబెటిస్‌కు చికిత్స పొందుతున్నవారు
7. యాంజినా మరియు రక్తపోటు(Hypertension) లేదా షుగర్ వ్యాధి(Diabetes)కి చికిత్స తీసుకుంటున్నావారు
8. CT లేదా MRI స్ట్రోక్ డాక్యుమెంట్ మరియు రక్తపోటు లేదా డయాబెటిస్ పేషెంట్లు.
9. పల్మనరీ ఆర్టరీ రక్తపోటు మరియు అధిక రక్తపోటు (Hypertension) లేదా షుగర్ వ్యాధి(Diabetes) చికిత్స పొందుతున్నవారు
10. పదేళ్ల కన్నా ఎక్కువగా మధుమేహం దాని సంబంధిత సమస్య మరియు రక్తపోటు సమస్యకు చికిత్స తీసుకుంటున్నవారు

Also Read: COVID-19 Vaccine తొలి డోసు తీసుకున్న ప్రధాని Narendra Modi, అనంతరం ఏమన్నారంటే
11. మూత్రపిండాలు(Kidney) లేదా కాలేయం(Liver) లేదా హెమటోపాయిటిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్న పేషెంట్లు లేదా అందుకు సిద్ధంగా ఉన్న వ్యక్తులు
12. హిమోడయాలసిస్ లేదా సీఏపీడీతో చివరి దశలో మూత్రపిండాల వ్యాధిగ్రస్తులు
13. నోటి సంబంధిత కార్టికోస్టెరాయిడ్స్ లేదా రోగనిరోధక శక్తిని పెంపుదల కోసం దీర్ఘకాలం నుంచి మెడిసిన్ వినియోగిస్తున్నవారు
14. సిర్రోసిస్ క్షీణించిన వ్యక్తులు
15. గత రెండేళ్ల కాలవ్యవధిలో తీవ్రమైన శ్వాసకోశ వ్యాధితో లేదా FEVI 50 శాతం కన్నా తక్కువగా ఉన్న వ్యక్తులు

Also Read: Migraine: తలనొప్పే కదా అని ఈజీగా తీసుకోవద్దు, Neck Pain వస్తే డాక్టర్‌ను సంప్రదించాలి
16. లింఫోమా లేదా లుకేమియా లేదా మైలోమా లక్షణాలు కలిగినవారు
17. జూలై 1, 2020 తరువాత క్యాన్సర్ వ్యాధి ఉందని నిర్ధారణ అయిన వ్యక్తులు లేదా ప్రస్తుతం ఏదైనా క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్నవారు
18. ఎర్రకణముల క్షీణత (Sickle Cell Disease) లేదా ఎముక మజ్జ వైఫల్యం (Bone Marrow Failure) లేదా అప్లాస్టిక్ అనిమియా లేదా తీవ్రమైన తలసేమియా ఉన్నవారు
19. రోగనిరోధక శక్తికి సంబంధిత ప్రాథమిక వ్యాధులు లేదా HIV  ఇన్‌ఫెక్షన్
20. మానసిక వైకల్యం వ్యక్తులు లేదా కండరాల బలహీనత లేదా యాసిడ్ దాడి వల్ల శ్వాస వ్యవస్థ దెబ్బతింటే లేదా ఇతరుల మీద ఆధారపడే దివ్యాంగులు లేదా చెవిటి-అంధత్వం లాంటి పలు అనారోగ్య సమస్యలు ఉన్నవారు

Also Read: Pregnancy Tips: ఇద్దరు పిల్లలకు మధ్య మహిళలు ఎంత Age Gap ఎంత తీసుకోవాలంటే 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News