Ragi Malt Benefits: రాగి మాల్ట్ తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. అలాగే ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడుకుండా ఉంటాము. రాగి జావ ఇష్టపడని పిల్లలకు ఇలా దానిని షర్బత్ లాగా చేసి ఇవ్వడం వల్ల వారు మరింత ఇష్టంగా తాగుతారు. అయితే దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మనం ఎప్పుడు తెలుసుకుందాం.
రాగి మాల్ట్ తయారీకి కావలసిన పదార్థాలు:
రాగి జావ తగినంత, పంచదార రెండు టేబుల్ స్పూన్స్, ఐస్ క్యూబ్స్ తగినంత,
నానబెట్టిన సబ్జా గింజలు ఒక టీ స్పూన్, పుదీనా ఆకులు ,
ఉప్పు చిటికెడు, నిమ్మరసం అర చెక్క
రాగి మాల్ట్ షర్బత్ తయారీ విధానం:
ఒక గిన్నెలో నిమ్మకాయ రసాన్ని తీసుకోవాలి. తరువాత పంచదార వేసి కలపాలి. ఇందులోకి ఐస్ క్యూబ్స్‌ను , సబ్జా గింజలు వేసి బాగా కలుపుకోవాలి. తగినంత రాగి జావ వేసి కలపాలి. తరువాత కొన్ని పుదీనా ఆకులు, చిటికెడు ఉప్పు వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల రాగి మాల్ట్ షర్బత్ తయారవుతుంది. దీనిని గ్లాస్ లో పోసి చల్ల చల్లగా సర్వ్ చేసుకోవాలి.
Also Read Teeth Whitening Naturally: ఈ చిట్కాలను పాటించడం వల్ల తెల్లటి దంతాలు మీ సొంతం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter