Bone Health: శీతాకాలంలో ఎముకల బలానికి తినాల్సిన డ్రై ఫ్రూట్స్ ఇవే!

Eating Dry Fruits Improves Bone Health: శీతాకాలంలో చాలా మంది ఎముకలు, కీళ్ల సమస్యలతో బాధపడుతుంటారు. నొప్పి తగ్గించడానికి వివిధ రకాల మందులు, ప్రొడెక్ట్స్‌ను ఉపయోగిస్తుంటారు. దీనివల్ల ఉపశమనం పొందిన మళ్లీ సమస్య వస్తూ ఉంటుంది. అయితే ఈ సమస్య నుంచి బయట పడాలంటే ప్రతిరోజు డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. ఎలాంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మేలు జరుగుతుందనేది మనం తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 13, 2024, 06:45 AM IST
Bone Health: శీతాకాలంలో ఎముకల బలానికి తినాల్సిన డ్రై ఫ్రూట్స్ ఇవే!

Eating Dry Fruits Improves Bone Health: ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా ప్రతిరోజు డ్రై ఫ్రూట్స్‌ని మీ ఆహారంలో భాగంగా చేసుకోవాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఎముకలు దృఢంగా ఉండటం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడాల్సిన అవసరంలేదని చెబుతున్నారు.  ప్రతిరోజు డ్రై ఫ్రూట్స్‌ తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది. ఎలాంటి డ్రై ఫ్రూట్స్‌ తీసుకోవాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

. వాల్‌నట్స్‌  తీసుకోవడం వల్ల  ఇందులోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ శరీరానికి  పుష్కలంగా లభిస్తాయి. దీని చలికాలంలో వచ్చే కీళ్ల వాపులను తగ్గిస్తుంది.

.  బాదం తీసుకోవడం వల్ల  ఎముకలు దృఢంగా ఉంటాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇందులోని క్యాల్షియం ఎముకలను బలంగా తయారు చేస్తుంది.

. ఖర్జూరం తీసుకోవడం వల్ల కాపర్‌ , మెగ్నీషియం వంటి గుణాలు లభిస్తాయి. దీని వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.

Also read: Cloves Tea Benefits: చలి కాలంలో లవంగాల టీ తాగితే శరీరానికి లాభాలే..లాభాలు..

. జీడిపప్పు  తీసుకోవడం వల్ల  ఇందులోని  క్యాల్షియం, ఐరన్ ఎముకల సాంద్రతను పెంచుతుందని వైద్యులు చెబుతున్నారు.
 
. అంజీర్‌లో కాల్షియం, పొటాషియం  వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల ఎముకలను దృఢంగా తయారు చేయడంలో సహాయపడుతాయి.

Also read: Early Morning Sunshine: ఉదయం ఎండలో నిలబడుతున్నారు? అయితే ఈ విషయం మీకు తెలుసా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News