Belly Fat Loss: పొట్ట చుట్టూ కొవ్వుని కరిగించాలి అనుకుంటున్నారా.. ఇవి తినడం మర్చిపోవద్దు

Nuts for Weight Loss: బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ముందుగా తగ్గించాలి అనుకునేది పొట్ట చుట్టూ పేరుకుపోయి ఉండే కొవ్వుని. బెల్లీ ఫ్యాట్ ని తగ్గించడం కోసం మన ఆహారంలో కొన్ని ముఖ్యమైన నట్స్ ను కూడా జత చేయాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం.  

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 21, 2024, 10:15 AM IST
Belly Fat Loss: పొట్ట చుట్టూ కొవ్వుని కరిగించాలి అనుకుంటున్నారా.. ఇవి తినడం మర్చిపోవద్దు

Nuts for Belly Fat: బరువు తగ్గాలి అనుకునే ప్రతి వాళ్లు ముందుగా తగ్గించాలి అనుకునేది పొట్ట చుట్టూ ఉండే ఫ్యాట్ ని. పొట్ట చుట్టుకొలత తగ్గితే సగం బరువు తగ్గిపోయినట్లే. కానీ బెల్లీ ఫ్యాట్ తగ్గించడం కొంచెం కష్టంతో కూడుకున్న పని. దీనికోసం ముఖ్యంగా వ్యాయామం మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. 

కచ్చితంగా ప్రతి రోజు పొట్ట మీద ప్రెజర్ ఉండే వర్కౌట్స్ చేస్తూ ఉంటే కొంచెం ఉపయోగముంటుంది. వ్యాయామంతో పాటు మన డైట్ లో కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు ఫాలో అవ్వాల్సిఉంటుంది. అందులో మొదటిది మన ఆహారంలో నట్స్ ని యాడ్ చేయడం. 

ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలలో నట్స్ కూడా ముఖ్యమైనవి. వాటిలో ఉండే హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్ కంటెంట్, ప్రోటీన్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొన్ని నట్స్ తినడం వల్ల బరువు కూడా చాలా త్వరగా తగ్గిపోవచ్చు. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి ఎలాంటి నట్స్ తీసుకుంటే మంచిది అని ఇప్పుడు తెలుసుకుందాం.

బాదం..

బాదంలో ఉండే హెల్తీ ఫ్యాట్ మెదడు డెవలప్‌మెంట్‌కి ఉపయోగపడుతుంది. మన వెయిట్ మేనేజ్‌మెంట్‌లో కూడా ఇవి బాగా హెల్ప్ చేస్తాయి. బాదం లో ఉండే మోనో శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ తక్కువగా ఉంటాయి. ఫైబర్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. 

జీడిపప్పు..

జీడిపప్పులో హెల్దీ మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. వాటిలో ప్రోటీన్, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల కడుపు నిండుగా ఉంటుంది. ఆకలి ఎక్కువగా వేయదు కాబట్టి తక్కువగా తింటాం. అప్పుడు బరువు కూడా తగ్గిపోవచ్చు.

మకాడమియా నట్స్..

మకాడమియా నట్స్‌ లో ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్‌ మనం తీసుకునే ఆహారంవల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా బ్యాలెన్స్‌గా ఉంచేందుకు ఉపయోగపడతాయి. ఈ నట్స్ లో కార్బోహైడ్రేట్స్ కూడా తక్కువగా ఉండటం వల్ల మన గుండె ఆరోగ్యానికి కూడా ఇవి బాగా మేలు చేస్తాయి.

వాల్ నట్స్..

వాల్ నట్స్ లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మన గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో కేలరీలు కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలి అనేవాళ్ళ్ళు వీటిని మితంగా తీసుకోవాలి. 

ఈ నట్స్ అన్నీ డైట్‌లో చేర్చుకుంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. వీటి వల్ల మన శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ అందుతాయి. ఈ నట్స్ తో పాటు సరైన వర్కౌట్ కూడా చేస్తే మన బాడీ లో ఉండే కేలరీలు వద్దు అన్నా కూడా చక్కగా తగ్గిపోయి కొలెస్ట్రాల్ తో పాటు బరువు కూడా త్వరగా తగ్గుతాము.

Also Read: Babun Banerjee: ఓటు వేయడానికి వెళ్లిన ముఖ్యమంత్రి తమ్ముడికి భారీ షాక్‌.. ఏం జరిగిందంటే?

Also Read: Air India Flight: ట్రక్‌ను ఢీకొన్న ఎయిరిండియా విమానం.. ప్రాణభయంతో ఉలిక్కిపడిన ప్రయాణికులు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News