Pooja rituals:మీరు పూజ చేసేటప్పుడు ఏ దిశలో ముఖాన్ని ఉంచాలో తెలుసా?

Pooja direction: పూజ ఎంత నిష్టగా చేసినా కొన్నిసార్లు మనకు ఫలితం దక్కలేదు అని బాధపడతాం. పూజా విధివిధానాల్లో తీసుకునే శ్రద్ధ ..ఏ దిక్కున నిలబడి దేవుని కొలుస్తున్నాం అనే విషయంలో తీసుకోము. మనం నిలబడి పూజ చేసే దిశ కూడా మనకు వచ్చే ఫలితాన్ని నిర్దేశిస్తుంది అని మీకు తెలుసా?  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 22, 2023, 11:47 PM IST
Pooja rituals:మీరు పూజ చేసేటప్పుడు ఏ దిశలో ముఖాన్ని ఉంచాలో తెలుసా?

Pooja mandir: ప్రతి మతంలోనూ దేవుడి ఆరాధనకు కొన్ని ప్రత్యేకమైన నియమాలు ఉంటాయి. అలాగే హిందూ మతం ప్రకారం పొద్దునా..సాయంత్రం రెండు పూటలా దేవుడిని పూజించాలి అన్న నియమం ఉంది. పూజ చేసే విధి విధానాల పై కూడా హిందువులు కొన్ని నియమాలను పాటిస్తారు. వీటిలో ముఖ్యంగా పూజ గది ఏ డైరెక్షన్లో ఉండాలి ..మనం ఏ డైరెక్షన్లో కూర్చుని పూజ చేయాలి అనేవి ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు.

వాస్తు శాస్త్రాన్ని మన వాళ్ళు ఎక్కువగా నమ్ముతారు. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులకు కొన్ని నిర్దిష్ట దిశలు ఉంటాయి. వాటిని అలా పెట్టడం వల్ల ఎంతగా కలిసి వస్తుందో.. పెట్టకూడని దిశలో పెట్టడం వల్ల అంత వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది అని వాస్తు శాస్త్రజ్ఞులు నమ్ముతారు. మనం చేసే పూజ యొక్క ఫలితం పూర్తిగా మనకు దక్కాలి అంటే దేవుడి గది డైరెక్షన్ తో పాటు మనం ఏ దిక్కున కూర్చుని పూజ చేస్తాము అనేది కూడా ఎంతో ముఖ్యమట. మరి మనం ఏ దిశలో ముఖం పెట్టుకొని కూర్చుని పూజ చేయాలో తెలుసుకుందామా..

వాస్తు శాస్త్రం ప్రకారం పూజ చేసే వ్యక్తి తూర్పు లేదా ఉత్తర దిశ వైపు మీ ముఖం ఉండేలా చూడాలి. ఈ రెండు దిశలు పాజిటివ్ ఎనర్జీకి మెయిన్ ద్వారం లాంటివి. అందుకే దేవుడి పూజ చేసే సమయంలో ఈ దిశలో పూజ చేస్తే ఫలితం రెట్టింపు పొందుతారు. ఎక్కువగా తూర్పు దిక్కున ముఖం పెట్టి పూజ చేస్తే మంచిది అని అందరూ భావిస్తారు. మనవాళ్లు ఎక్కువగా సిరిసంపదలతో తులతూగాలి అని లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. ఆర్థిక సమస్యలు తొలగుతాయని భావిస్తారు.

అందుకే ఇంటిలో పూజా మందిరం కట్టేటప్పుడు ఏ దిశలో ఉంది అన్న విషయాన్ని జాగ్రత్తగా పరిగణించాల్సి ఉంటుంది. దేవుడి గది తలుపులు ఎప్పుడు కూడా తూర్పు వైపే ఉండాలి. అలా ఉండడం వల్ల మీ ఇంట్లో అన్ని సుఖంగా..సవ్యంగా జరుగుతాయి. స్వచ్ఛమైన గాలి, సూర్యకిరణాలు పూజా మందిరంలోకి ధారాళంగా ప్రవహించే విధంగా ఉండాలి. అప్పుడే ఇల్లు మొత్తం మంచి పాజిటివ్ వైబ్స్ తో నిండిపోతుంది.

Also Read: Samsung Mobile Loot Offer: సాంసంగ్‌ వెబ్‌సైట్‌లో పిచ్చెక్కించే డీల్స్‌..Galaxy F54, M34 మొబైల్స్‌పై భారీ తగ్గింపు!  

 

Also Read: Oneplus 12 Launch: పిచ్చెక్కిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి Oneplus 12 స్మార్ట్ ఫోన్..ధర, ఫీచర్ల వివరాలు ఇవే..  

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News