Benefits Of Cucumber For Hair: జుట్టు సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే ఇది మీ కోసమే..!

Benefits Of Cucumber For Hair: దోసకాయ ఆరోగ్యానికి చాలా ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇందులో వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉండడం వల్ల శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేట్ గా ఉంచుతుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 29, 2022, 04:57 PM IST
  • జుట్టు సమస్యలతో బాధపడుతున్నారా..
  • దోసకాయను ఇలా జుట్టుకు పట్టించాలి
  • జుట్టు సమస్యలు దూరమవుతాయి
Benefits Of Cucumber For Hair: జుట్టు సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే ఇది మీ కోసమే..!

Benefits Of Cucumber For Hair: దోసకాయ ఆరోగ్యానికి చాలా ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇందులో వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉండడం వల్ల శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేట్ గా ఉంచుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాల వల్ల శరీరానికి చాలా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే కీరదోసకాయను తినడమే కాకుండా చర్మం, జుట్టుకు అప్లై చేయాచ్చు. ఇలా అప్లై చేయడం వల్ల చర్మం, జుట్టు సమస్యలు తొలగిపోతాయని నిపుణులు పేర్కొన్నారు. దోసకాయను జుట్టులో ఎలా ఉపయోగించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

దోసకాయను ఇలా జుట్టుకు పట్టించాలి:

దోసకాయ రసంతో మసాజ్ చేయండి:

జుట్టు పెరుగుదల, షైన్ కోసం దోసకాయ రసాన్ని వినియోగించవచ్చని ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొన్నారు. ఇది జుట్టుకు చాలా ప్రభావవంతంగా పని చేస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. దీని కోసం.. జుట్టు పొడవు ప్రకారం ఒకటి నుంచి 2 దోసకాయలను తీసుకోండి.  వాటిని మిక్సీ గ్రైండర్‌లో వేసి బాగా రుబ్బుకోని.. రసాన్ని ఒక గిన్నెలో తీసుకోండి. ఇప్పుడు దోసకాయ రసాన్ని మీ జుట్టు మూలాలకు అప్లై చేసి.. అర గంటపాటు అలాగే ఉంచండి. దీని తర్వాత సర్క్యులర్ మోషన్‌లో బాగా మసాజ్ చేయండి. ఆ తర్వాత జుట్టును నీటితో శుభ్రం చేయండి.

దోసకాయ రసం, నిమ్మరసం జుట్టుకు రాయండి:

దోసకాయ రసం, నిమ్మరసం ఉపయోగించడం ద్వారా చుండ్రు సమస్యను అధిగమించవచ్చ నిపుణులు తెలుపుతున్నారు. దీని కోసం సగం కంటే తక్కువ దోసకాయ రసం తీసుకుని.. ఆ తరువాత అందులో 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలపండి. దీని తర్వాత సుమారు 30 నిమిషాల తర్వాత జుట్టును కడగాలి.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

 

Also Read:  White Hair Treatment At Home: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే ఇది మీ కోసమే..!

Also Read: Meena Husband Vidyasagar: పావురాల వల్ల ప్రాణాలు కోల్పోయిన మీనా భర్త... అప్పట్లోనే జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం.. కానీ?

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

 

Trending News