Back Pain Relief In 2 Days: శీతాకాలంలో చాలా మందిలో నడుము నొప్పి, వెన్ను నొప్పి, మోకాళ్ల నొప్పి సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే నొప్పులు తీవ్రతరమయ్యే ఛాన్స్‌లు ఉన్నాయి. అంతేకాకుండా ఈ సమస్యలు చాలా మంది ఒత్తిడి కారణంగా కూడా వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ నొప్పుల కారణంగా చాలా మంది కూర్చోవడం, నవడానికి కూడా కష్టపడుతున్నారు. కాబట్టి శీతాకాలంలో ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంటుంది.
ఈ చిట్కాలు పాటించాల్సి ఉంటుంది:
నూనెతో మర్దన:
నడుము నొప్పులతో బాధపడేవారు శీతాకాలంలో ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా తీవ్ర నొప్పులతో బాధపడేవారు ఆయుర్వేద గుణాలతో తయారు చేసిన నూనెతో మసాజ్ చేయాల్సి ఉంటుంది. ఆయుర్వేద నిపుణులు సూచించిన ఆవనూనెలో వెల్లుల్లి రెబ్బలను వేయించి ప్రభావిత ప్రాంతంలో అప్లై చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండామ ఇతర నొప్పులు నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
సరైన భంగిమలో కూర్చోండి:
నడుము నొప్పితో బాధపడేవారు ఆఫీసుల్లో ఎక్కువగా కూర్చోవడం మానుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆఫీస్సుల్లో ఎక్కువ సేపు కూర్చుని పనులు చేసేవారు కనీసం గంటకు 10 నిమిషాల పాటు వాకింగ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఒకే భంగిమలో కూర్చువడం మానుకోవాలని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
Also Read: Poco M4 5G Price: 50MP కెమెరా Poco M4 5G మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.11,000లోపే పొందండి!
వేడి నీటితో స్నానం చేయండి:
నడుము నొప్పితో బాధపడేవారు ప్రతి రోజు వేడి నీటితో మాత్రమే స్నానం చేయాల్సి ఉంటుంది. ఒక బకెట్ గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల యూకలిప్టస్ నూనె వేసి కలిపి స్నానం చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. దీంతో పాటు ఇతర నొప్పుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇలా చేస్తే ఒత్తిడి సమస్యలు కూడా దూరమవుతాయి.
వ్యాయామాలు తప్పకుండా చేయండి:
శరీరం ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి రోజు వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. ప్రతి రోజు యోగాతో పాటు వ్యాయామాలు చేయడం వల్ల నడుము నొప్పుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. కాబట్టి కీళ్ల నొప్పు, నడుము నొప్పులతో బాధపడేవారు ప్రతి రోజు వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది.
పసుపు, పాలు:
నడుము నొప్పుల నుంచి ఉపశమనం కలిగించేందుకు పసుపు, పాలు కూడా ప్రభావంతంగా సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి నడుములతో బాధపడేవారు ప్రతి రోజు పసుపు పాలను తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: Poco M4 5G Price: 50MP కెమెరా Poco M4 5G మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.11,000లోపే పొందండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook