Asthma: వర్షాకాలంలో ఆస్తమాతో బాధపడుతున్నవారు.. కేవలం ఈ ఆహారాలను మాత్రమే తీసుకోవాలి..

Asthma patients: భారత్లో రోజురోజుకు ఆస్తమాతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ సమస్య కొందరిలో శ్వాసకోశలో ఇబ్బందులు ఏర్పడి.. ప్రాణాంతక సమస్యగా మారిపోతోంది. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా కొన్ని రకాల ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది.

Last Updated : Aug 29, 2022, 12:04 PM IST
  • వర్షాకాలంలో ఆస్తమాతో బాధపడుతున్నవారు..
  • అల్లం, వెల్లుల్లి, పసుపు ఎక్కువగా తీసుకోవాలి
  • ఇలా చేస్తే తీవ్ర వ్యాధిగా మారే అవకాశాలుండవు.
Asthma: వర్షాకాలంలో ఆస్తమాతో బాధపడుతున్నవారు.. కేవలం ఈ ఆహారాలను మాత్రమే తీసుకోవాలి..

Asthma patients: భారత్లో రోజురోజుకు ఆస్తమాతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ సమస్య కొందరిలో శ్వాసకోశలో ఇబ్బందులు ఏర్పడి.. ప్రాణాంతక సమస్యగా మారిపోతోంది. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా కొన్ని రకాల ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలం లో వీరు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు కూడా అధికమని నిపుణులు తెలుపుతున్నారు. కొందరిలో ఈ సమస్య వల్ల మధుమేహం సమస్యలు, గుండె సమస్యలు వస్తూ ఉండడం విశేషం. ఆస్తమా సమస్యతో బాధపడేవారు వారి ఆహారంలో పలు రకాల నియమాలు పాటించారు. ముఖ్యంగా వీరు ఈ కింద సూచించిన ఆహార నియమాలు పాటిస్తే మంచి ప్రయోజనాలు పొందుతారు.

ఆస్తమా ఉన్నవారు వర్షాకాలంలో వీటిని ఆహారంగా తీసుకోవాలి:

అల్లం, వెల్లుల్లి:
ఇది శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుందని ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొంది. ఇందులో అధిక పరిమాణంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కాబట్టి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడుతుంది. అయితే ఆస్తమాతో బాధపడుతున్న వారికి ఇవి చాలా రకాలుగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఊపిరితిత్తుల సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి వీటిని ఆహారాల్లో అధిక పరిమాణంలో తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు.

పసుపు:
భారతీయులు ప్రతి వంటకంలో పసుపును వినియోగిస్తారు. ఇది వ్యాధులను నియంత్రించడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. రోగాల బారిన పడకుండా రక్షిస్తుంది. కాబట్టి ఆస్తమాతో బాధపడుతున్న వారు తప్పకుండా పాలలో పసుపు వేసుకొని తాగడం వల్ల ఆస్తమాకు చెక్ పెట్టొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

గ్రీన్ టీ:
ప్రస్తుతం చాలామంది బరువు తగ్గే క్రమంలో గ్రీన్ టీ లను తాగుతున్నారు. అయితే గ్రీన్ టీలలో యాంటీ ఆక్సిడెంట్ లో పరిమాణం అధికంగా ఉండడం వల్ల ఇది బాడీని చురుకుగా చేస్తోంది. కాబట్టి ఆస్తమాతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ టీని తీసుకోవాలని నిపుణులు తెలుపుతన్నారు. ఈ సమస్యతో బాధపడుతున్నవారు రోజుకు రెండు సార్లు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు.

పెరుగు:
ఆస్తమాతో బాధపడేవారు పాలకు బదులుగా పెరుగును తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పెరుగులో శరీరానికి కావాల్సి ప్రో-బయోటిక్ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి వీరు పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు.

కూరగాయలు:
ఆస్తమాతో బాధపడేవారు వానా కాలంలో పచ్చి కూరగాయలను అస్సలు తినొద్దని నిపుణులు సూచిస్తున్నారు. వర్షా కాలంలో వీటిపై ప్రమాదకరమైన జెర్మ్స్ వ్యాపించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీటిని తీసుకోకపోవడం మంచిది.

Also read:  Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్‌ పెట్టొచ్చు

Also read:  Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్‌ పెట్టొచ్చు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News