Arthritis Pain Relief: దేశవ్యాప్తంగా ఆర్థరైటిస్ రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం ఈ సంఖ్య భారత్ వ్యాప్తంగా సుమారు 180 మిలియన్లకు చేరుకుంది. వీరిలో 15 కోట్ల మంది మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. ఆర్థరైటిస్ అనేది శరీరంలోని ఎముకలు బలహీనంగా వచ్చే వ్యాధి. అయితే ఈ సమస్యల నుంచి ఎంత సులభంగా ఉపశమనం పొందితే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ వ్యాధి వల్ల శరీరంపై ఎలాంటి ప్రభావం పడబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వైద్యులు నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..ఇవి శరీరంలో కీళ్లపై కాకుండా.. ఎముకలు శరీరంలోని ఇతర 14 అవయవాలను ప్రభావితం చేస్తుంది. ఇది కొన్ని సందర్భాల్లో బోలు ఎముకల వ్యాధి, కండరాల బలహీనత, కణాల సమస్యలు, పొడి, ఎరుపు కళ్ళు, రక్తహీనత, న్యుమోనియా, గుండెపోటు, స్ట్రోక్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఇప్పుడు యువతలో కూడా కీళ్లనొప్పులు సాధారణంగా మారాయి. 30 నుంచి 40 ఏళ్లలోపు వారిలో కూడా కీళ్ల నొప్పులు వస్తున్నాయి.
చిన్న వయసులోనే ఆర్థరైటిస్ ఎందుకు వస్తుంది?:
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. యువతలో స్టెరాయిడ్స్, సప్లిమెంట్లు తీసుకునే ట్రెండ్ బాగా పెరిగిపోయింది. దీంతో పాటు కండరాలను బలోపేతం చేయడానికి వ్యాయామాలు చేస్తున్నారు. వీటి వల్ల కూడా కీళ్ల నొప్పుల వంటి సమస్యల వచ్చే అవకాశాలున్నాయి. ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మందిలో యాల్షియం కోరత ఏర్పుడుతోంది. అంతేకాకుండా ఎక్కువ సేపు ఒకే చోట కూర్చుంటున్నారు. అయితే దీని వల్లే తీవ్ర కీళ్ల నొప్పుల బారి పడుతున్నారు.
ఆస్టియో ఆర్థరైటిస్ కేసులు కూడా పెరుగుతున్నాయి:
భారత్‌లో కరోనా కల్లోలం తర్వాత ఆస్టియో ఆర్థరైటిస్ కేసులు సమస్య కూడా పెరుగుతోంది. ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఒక రకమైన ఆర్థరైటిస్. వయస్సు పెరిగిన వారిలో కీళ్ల నొప్పులు పెరిగిన కొద్ది ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. ఈ ఆర్థరైటిస్ పెరగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కాబట్టి తప్పకుండా వీరు తీసుకునే ఆహారంలో తప్పకుండా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
Also Read: Dewald Brevis: బేబీ ఏబీ తుఫాన్ ఇన్నింగ్స్.. 57 బంతుల్లోనే 162 పరుగులు
Also Read: Minister KTR: సీఎం జగన్ నా బెస్ట్ ఫ్రెండ్.. ఏపీ మూడు రాజధానులపై మంత్రి కేటీఆర్ రియాక్షన్ ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook