Protein Powder: ప్రొటీన్‌ పౌడర్ వల్ల కలిగే సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఇవే!

Protein Powder Side Effects: మన శరీరానికి అనేక రకాలు ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్‌ అవసరం ఉంటుంది. శరీరానికి కావాల్సిన పోషకాలు అందకపోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుంది. ముఖ్యంగా శరీరంలో ప్రొటీన్‌ లోపం వల్ల రకరకాల వ్యాధులు వస్తాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 7, 2024, 02:06 PM IST
Protein Powder: ప్రొటీన్‌ పౌడర్  వల్ల కలిగే సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఇవే!

Protein Powder Side Effects: సాధారణంగా మన శరీరానికి విటమిన్‌, మినరల్స్, ప్రొటీన్‌ ఇతర పోషకాలు చాలా అవసరం. వీటిని ప్రతిరోజు మన ఆహారంలో తీసుకోవడం అవసరమని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.  దీని వల్ల ఎలాంటి అనారోగ్యసమస్యల రాకుండా కాపాడుతాయి.  అయితే శరీరానికి ప్రొటీన్ ముఖ్య ప్రాత పోషిస్తుంది. కొంత మంది ప్రొటీన్‌ సమస్యతో బాధపడుతుంటారు. దీని కోసం మందులు, ప్రొటీన్ పౌడర్‌ను ఉపయోగిస్తారు.  దీని ఎక్కువగా ఉపయోగించడం వల్ల శరీరానికి దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. 

షుగర్‌ లెవెల్స్‌ అధికంగా:

ప్రొటీన్‌ పౌడర్‌ తీసుకోవడం వల్ల ఇన్సులిన్ అధికంగా పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతాయి. దీని వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుంది.

జీర్ణ సమస్యలు:

ప్రతిరోజు ప్రొటీన్‌ పౌడర్‌ తీసుకోవడం వల్ల ఆరోగ్యం మీద చెడు ప్రభావం కలుగుతుంది. ఇందులో ఉపయోగించే  స్వీటెనర్లు, రంగులు కారణంగా ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియా దెబ్బతింటుంది. దీని వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. 

కిడ్నీలకు దెబ్బ:

ప్రొటీన్ పౌడర్‌ అధికంగా తీసుకోవడం వల్ల కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా కిడ్నీలో రాళ్లు ఏర్పడడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

హార్మోన్ల అసమతుల్యత:

కొన్ని రకాల ప్రొటీన్ పౌడర్లు సోయా ఆధారితవి వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. దీని కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. సోయాలో అమినో యాసిడ్స్ , ఫైటోఈస్ట్రోజెన్లు అధికంగా ఉంటాయి. 

అలసట,  రొమ్ము పరిమాణంలో మార్పులకు వంటి సమస్యలు  కలుగుతాయి. కాబట్టి ప్రొటీన్ పౌడర్ తీసుకునే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రొటీన్ పౌడర్‌ తీసుకునే ముందు ఆరోగ్య నిపుణులు సూచనలు తీసుకోవడం చాలా అవసరం. ప్రొటీన్‌ పౌడర్ ఎక్కువగా తీసుకోకుండా మితిగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. కాబట్టి ప్రొటీన్ పౌడర్‌ కన్నా ఆరోగ్య కరమైన ఆహార పదార్ధాలు తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News