Aratikaya Ulli Karam: ప్రస్తుతం మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది హెల్తీ ఫుడ్‌ను తినడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పైసీ ఫుడ్ తినే వారి సంఖ్య అధికం. సహజ సిద్ధంగా లాభించే కూరగాయాలతో వంటకాలను తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా అరటికాయతో చేసిన ఆహార పదార్థాలు శరీరాన్ని దృఢంగా చేయడమే కాకుండా, మంచి పోషకాలను కూడా అందిస్తుంది. దీని చేసిన రెసిపీని చాలా మంది ఇష్టపడతారు. అయితే శరీరానికి పోషకాలు అందిచే రెసిపీని ఈ రోజూ మీకు పరిచయం చేయబోతున్నాం. అదేంటో ఇప్పుడు చూద్దాం..
ఆరటికాయ అనగానే అందరికి గుర్తుకు వచ్చేది అరటికాయ ఉల్లికారం. అయితే ఈ రెసిపీలో ఉడికించిన అరటికాయ, అల్లం, తాలింపు గింజలుంటాయి. ఇవీ శరీరానికి కావాల్సి అన్ని రకాల పోషకాలను అందించేందుకు సహాయపడతాయి. దీనికోసం గుంటూరులో లభించే ఆరటికాయలను వినియోగిస్తే అద్భుతమైన రుచి, మంచి పోషకాలు లభిస్తాయి. అయితే ఈ రెసిపీని తయారు చేసుకోవడం చాల సులభం. అయితే దీనిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రెసిపీ కావాల్సిన పదార్థాలు(Ingredients required for this recipe):
2 పచ్చి ఆరటికాయలు, పసుపు - కొద్దిగా, ఉప్పు- కొద్దిగా, 2 ఉల్లిపాయ తరుగు, అల్లం ఉల్లి ముద్ద కోసం, 1 tsp ఆవాలు, 4 tbsp నూనె, కూర కోసం, 4-5 పచ్చిమిర్చి, 1/2 inch అల్లం, కొత్తిమీర - కొద్దిగా, 1 tsp పచ్చి సెనగపప్పు, 1 tsp జీలకర్ర, 2 రెబ్బలు కరివేపాకు, 1 tsp మినపప్పు, 1 tsp నిమ్మరసం, ఉప్పు, 2 ఎండుమిర్చి, 1/4 tsp పసుపు
ఆరటికాయ ఉల్లికారం(Aratikaya Ulli Karam) తయారీ విధానం:
దీని కోసం ముందుగా పైన పేర్కొన్న పదార్థాలను తీసుకోవాలి:
1. మందుగా అరటి ముక్కలను చిన్నగా కట్ చేసి ఓ చిన్న బౌల్ వేసి ఉప్పు, పసుపు వేసి 10 నుంచి 20 నిమిషాల పాటు 80 శాతం ఉడికించాలి.
2. ఈ అరటి ముక్కల పొట్లును తీసి మిశ్రమంగా చేసుకోవాలి.
3. ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి(Onion, ginger, green chilli)లను గ్రైడ్ చేసి మిశ్రమంలా రుబ్బుకోవాలి
4. అయితే ఓ బౌల్‌లో నూనె వేడి చేసి పోపు దినుసులు వేసి ఎర్రగా వేపుకోవాలి.
5. ఆ పోపులో ఉల్లి ముద్ద, ఉప్పు, పసుపు, కరివేపాకును వేసి దోరగా వేయించాలి.
6. అయితే ఇదే పోపులో ఆ అరటి కాయ మిశ్రమాన్ని వేసి 8 నుంచి 9 నిమిషాల పాటు వేపుకోవాలి
7. నూనె పైకి వచ్చక అందులో కొత్తిమీరను, మసాల, నిమ్మరసం వేసి దింపుకోవాలి. అంతే శరీరానికి ఎంతో ప్రయోజనాలను ఇచ్చే ఆరటికాయ ఉల్లికారం రెడీ..
Also Read: Monsoon Makeup Tips: వానలో తడవడం వల్ల మేకప్ పోతోందా.. అయితే ఇలా చేయండి..!
Also Read: Sun Transit effect: కర్కాటక రాశిలో సూర్య సంచారం... ఈ రాశివారికి డబ్బే డబ్బు!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook