Almond Oil Benefits: చుండ్రుతో బాధపడే వారు ఈ రెండు ఇంటి చిట్కాలను పాటించండి!

Almond Oil Benefits: మారుతున్న జీవనశైలి, వాతావరణ మార్పులు కారణంగా మనలో చాలా మంది జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాం. అయితే ఇలాంటి సమస్యలను బాదం నూనెతో స్వస్తి పలకవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 21, 2022, 02:06 PM IST
Almond Oil Benefits: చుండ్రుతో బాధపడే వారు ఈ రెండు ఇంటి చిట్కాలను పాటించండి!

Almond Oil Benefits: బాదం నూనెలో జుట్టుకు అవసరమైన అనేక మూలకాలు ఉన్నాయి. బాదం నూనెలో విటమిన్ ఇ, ప్రొటీన్, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు జుట్టును మెరిసేలా చేస్తాయి. ఈ క్రమంలో బాదం నూనెతో జుట్టుకు మసాజ్ చేయడం వల్ల చుండ్రు సమస్య కూడా తొలగిపోతుంది. అయితే బాదం నూనెలో కొన్ని పదార్థాలను కలిపి రాసుకుంటే జుట్టు మరింత నిగనిగలాడుతుంది. 

బాదం నూనెలో ఇవి కలపండి..

1.నిమ్మరసం

బాదం నూనెలో నిమ్మరసం కలిపి రాసుకుంటే చుండ్రు పోతుంది. ఒక గిన్నెలో కొద్దిగా బాదం నూనెను తీసుకొని.. అందులో కొద్దిగా నిమ్మ రసాన్ని మిక్స్ చేసి.. ఆ తర్వాత జుట్టుకు అప్లే చేయాలి. అలా కొద్దిసేపు చేతులతో తలపై మసాజ్ చేయాలి. మసాజ్ చేసిన తర్వాత అవసరమైతే.. గంట తర్వాత లేదా మరుసటి రోజు షాంపూతో మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది. 

2. తేనె 

బాదం నూనె, తేనె, అరటిపండు.. ఇవి చుండ్రు సమస్యను తగ్గిస్తాయి. ఈ మూడింటిని బాగా మిక్స్ చేసి.. ఆ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. అది ఆరిన తర్వాత అరగంట లేదా గంట తర్వాత షాంఫూతో జుట్టును బాగా కడగాలి. ఇలా చేయడం వల్ల జుట్టు అందంగా కనిపించడమే కాకుండా నిగనిగలాడుతుంది.

(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా కొన్ని నివేదికల నుంచి గ్రహించబడింది. ఈ చిట్కాలను పాటించే ముందు సంబంధిత వైద్యుడ్ని సంప్రదించడం మంచిది. దీన్ని ZEE తెలుగు News ధ్రువీకరిచడం లేదు.)     

Also Read: Neck Pain After Sleeping: నిద్రలో మెడ కండరాలు పట్టేస్తున్నాయా? అయితే ఈ టిప్స్ పాటించండి!

Also Read: Weight Loss Nuts: ప్రతిరోజూ పిస్తా పప్పు తినడం వల్ల అధిక బరువును నియంత్రించుకోవచ్చు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News