Air Conditioner: ఇంటిలో ఎయిర్ కండిషనింగ్ (ఏసీ)ను గోడకే అమరుస్తారని అందరికి తెలిసిందే! ప్రతిచోటా ఏసీకి సంబంధించి ఇండోర్, అవుట్ డోర్ అనే యూనిట్స్ ఉంటాయి. ఇండోర్ లో స్ల్పిట్టర్ ఉంటగా.. ఇంటికి వెలుపల ఎయిర్ డిశ్చార్జ్ వెంట్ ను ఏర్పాటు చేస్తారు. అయితే ఏసీ ఇండోర్ యూనిట్ ను ఇంట్లోని గోడకు అమర్చడానికి గల కారణాలేంటో తెలుసా? దాన్ని తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి.
గోడకు పైభాగంలో ఏసీని అమర్చడానికి గల కారణం!
వేసవిలో ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ఇళ్లలో ఎయిర్ కండిషనర్ల (AC)ను వాడుతుంటారు. ఏసీ వినియోగించేవారి ఇంట్లో ఇండోర్ యూనిట్ అంటే చల్లని గాలిని స్ల్పిట్ చేసే పరికరం గోడకు పై భాగంలో ఎందుకు అమర్చుతారనే దాని వెనుక చాలా కథ ఉంది. అందుకు ఓ శాస్త్రీయ కారణం కూడా ఉంది.
వేడి గాలిలో ఎక్కువ తేమ ఉంటుంది. కాబట్టి, వేడి గాలి తేలియాడే స్వభావాన్ని కలిగి ఉంటుంది. అంటే ఇంట్లో వేడి గాలి పై కప్పుకు దగ్గరగా చేరుతుంది. దీంతో ఎయర్ కండిషనర్ ఆన్ చేసినప్పుడు పైనుంచి కింద వరకు చల్లని గాలి వస్తుంది. ఎక్కువ సాంద్రత కలిగిన చల్లని గాలి వెంటనే కిందికి చేరుకుంది. దీంతో పైన ఉన్న వేడి గాలి.. అవుట్ డోర్ యూనిట్ ద్వారా డిశ్చార్జ్ అవుతుంది. దీంతో గది వెంటనే చల్లగా మారిన అనుభూతి కలుగుతుంది.
అదే విధంగా చలి కాలంలో హీటర్లను తక్కువ ఎత్తులో ఉంచుతారు. ఎందుకంటే అధిక సాంద్రత కలిగిన చల్లని గాలి నేలకు కొద్దిగా ఎత్తులో ఉంటుంది. దీని వల్ల కింది నుంచి గాలి వెచ్చగా ఉంచేందుకు హీటర్లను తక్కువ ఎత్తులో ఉంచుతారు.
Also Read: Amazon AC Sale: సమ్మర్ వచ్చేస్తోంది.. రూ.4,687 ధరకే ఎయిర్ కండిషనర్.. ఈరోజే తుదిగడువు!
Also Read: Weight Loss Tips: బరువు తగ్గాలనుకుంటే మధ్యాహ్నం భోజనం తర్వాత ఇవి మానేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook