About Dussehra In Telugu: దసరా పండుగను ప్రతి సంవత్సరం ఆశ్విజమాసంలోని శుక్లపక్షంలో పదవ రోజున జరుపుకుంటారు. ఇది భారతీయులకు ఓ ప్రత్యేక పండగ చెప్పొచ్చు. అయితే పురాణాలు చెబుతున్న దాని ప్రకారం శ్రీరాముడికి రావణుడికి మధ్య భీకర యుద్ధం జరగడంతో.. ఈ యుద్ధంలో శ్రీరాముడు రావణున్ని ఓడించినందుకు గాను విజయదశమిగా పేరు వచ్చిందని పేర్కొన్నారు పేర్కొన్నాయి. అంతేకాకుండా మరికొన్ని పురాణాలు.. దుర్గాదేవి చెడుపై పోరాడి మహిసాసురుని అంతం చేసినందుకు గాను ఈ పండగను జరుపుకుంటారు. చెడు పై విజయం సాధించినందుకు గాను గుర్తింపుగా ఈ పండగను ప్రజలు జరుపుకునే వారని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. అయితే అన్ని పండగలు ప్రాముఖ్యతలు కలిగి ఉంటాయి. ఈ దసరా పండగ కూడా మరికొన్ని ప్రాముఖ్యతలను కలిగి ఉంది. అవేంటో మనం తెలుసుకోబోతున్నాం..
దసరాను మనం ఎందుకు జరుపుకుంటారు..?:
త్రేతా యుగములో ఇదే రోజున శ్రీరాముడు లంకాపతి అయిన రావణుని అతి క్రూరంగా సంహరించాడు. అంతేకాకుండా వీరిద్దరి మధ్య పది రోజులపాటు యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో భాగంగానే రాముడు రావణుని సంహరించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. రావణున్ని సంహరించి సీతాదేవిని శ్రీరాముడు పొందడం వల్ల పూర్వీకులు అంతా ఈ పండగను విజయదశమిగా జరుపుకున్నారు. ప్రస్తుతానికి ఇలానే కొనసాగుతూ వస్తుంది.
దసరా పండగను ఎలా జరుపుకోవాలో మీకు తెలుసా..?:
చాలా ప్రాంతాల్లో దసరా పండగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. దసరా రోజున రావణాసురుని దిష్టిబొమ్మను దహనం చేసి.. ఆనాడు జరిగిన విజయోత్సవానికి గుర్తింపుగా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు.
మరికొన్ని ప్రాంతాల్లో సాయంత్రం రావణుని దిష్టిబొమ్మను దగ్ధం చేసి.. పిల్లలు పెద్దలంతా బాణాసంచాను కాలుస్తారు. అంతేకాకుండా కొన్నిచోట్ల మిఠాయిలు కూడా పంచుకుంటారు. ఈ కార్యక్రమాన్ని నవరాత్రుల్లో చివరి రోజు అయినా తొమ్మిదవ రోజున జరుపుకుంటారు. దీంతో నవరాత్రులు ముగుస్తాయి.
తెలుగు రాష్ట్రాల్లో దసరా పండగ:
ఇక తెలుగు రాష్ట్రాల్లో దసరా పండగ విషయానికొస్తే.. విజయదశమి వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతాయి. ప్రజలంతా కొత్త దుస్తులను ధరించి.. అమ్మవారిని దర్శించుకుంటారు. అంతేకాకుండా అమ్మవారికి భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు పాటిస్తారు. నవరాత్రుల్లో చివరి రోజున అమ్మవారిని (దుర్గాదేవిని) చెరువుగట్లలో నిమజ్జనం చేస్తారు. ఈ కార్యక్రమం తర్వాత జంబి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook