Lok Sabha 2024 Polls: ఖమ్మం లోక్ సభ బరిలో ప్రియాంక వాద్రా.. ? టీ కాంగ్రెస్ వ్యూహం అదేనా.. ?

Lok Sabha 2024 Polls: తెలంగాణలోని ఖమ్మం లోక్ సభ సీటులపై ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సీటు నుంచి ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంక వాద్రా పోటీ చేయనున్నారా అంటే ఔననే అంటున్నాయి టీ కాంగ్రెస్ వర్గాలు..

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 24, 2024, 10:40 AM IST
Lok Sabha 2024 Polls: ఖమ్మం లోక్ సభ బరిలో ప్రియాంక వాద్రా.. ? టీ కాంగ్రెస్ వ్యూహం అదేనా.. ?

Lok Sabha 2024 Polls: తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచే సీట్లలో ఖమ్మం ఒకటి. అందుకే ఈ సీటుకు కాంగ్రెస్ పార్టీలో పెద్ద డిమాండ్ ఏర్పడింది. గత రెండు పర్యాయాలు ఈ సీటును వైసీపీ, బీఆర్ఎస్ గెలుస్తూ వచ్చాయి.  కానీ 2024 ఎన్నికల్లో అన్ని సర్వేలు ఖమ్మం సీటు కాంగ్రెస్ పార్టీకే అంటూ ఘంటాపథంగా చెబుతున్నారు.  తాజాగా ఈ సీటు నుంచి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని బరిలో దింపే అవకాశం ఉందా ? అంటే ఔననే అంటున్నాయి. రాష్ట్రంలోని 17 లోక్ సభ సీట్లలో ఖమ్మం, కరీంనగర్,హైదారాబాద్ సీట్లకు అభ్యర్ధులను ఇంకా ప్రకటించలేదు. మరి తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్లకు మరో రోజు మాత్రమే గడువు ఉంది. ఒకవేళ ప్రకటిస్తే..   రేపటి లోపు నామినేషన్ దాఖలు చేయాలి.  ముందుగా ఈ సీటును నుంచి సోనియా గాంధీని పోటి చేయించాలని టీ కాంగ్రెస్ భావించింది.  ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. మరోవైపు ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలి నుంచి ప్రియాంక వాద్రా పోటీ చేయనున్నట్టు సమాచారం.

తాజాగా ఖమ్మం లోక్ సభ సీటుకు సంబంధించి ప్రియాంక పేరు మరో సారి ముందుకు వచ్చింది. ఇప్పటికే రాహుల్ గాంధీ దక్షిణాదిలో వాయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. మరోవైపు ఈయన 5వ విడతలో ఉత్తర ప్రదేశ్‌లోని అమేఠీ నుంచి పోటీ చేసే అవకాశాలను కొట్టిపారేయలేయమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికీ అక్కడ కాంగ్రెస్ పార్టీ అక్కడ తన అభ్యర్ధిని ప్రకటించలేదు. దీంతో కేరళలో ఎన్నికల తర్వాత అమేఠీ స్థానం నుంచి  రాహుల గాంధీ పోటీ చేసినా ఆశ్యర్యపోవాల్సిన పనిలేదు. మరోవైపు తెలంగాణలో ప్రియాంక వాద్రా పోటీ చేస్తే ఆ ఎఫెక్ట్ రాష్ట్రం మొత్తంపై ఉంటుందనేది కాంగ్రెస్ వర్గాల వాదన. మొత్తంగా ఉత్తారాదిలో రాయబరేలితో పాటు దక్షిణాదినా ఖమ్మం నుంచి పోటీ చేయించాలని కాంగ్రెస్ హై కమాండ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఖమ్మం సీటు పై ఆశ పెట్టుకున్న ఎంతో మందిని కాదని ప్రియాంక వాద్రాకు ఈ సీటును కేటాయిస్తారా అనేది చూడాలి. ఒకవేళ ప్రియాంక వాద్రా రాయబరేలి నుంచి గెలిస్తే.. ఖమ్మం సీటుకు రాజీనామా చేయాల్సి ఉంటుంది.  అపుడు ఈ సీటు నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి బరిలో నిలిచే అవకాశాలుంటాయి. ఒకవేళ రాయబరేలిలో ప్రియాంక ఓడిపోతే పరిస్థితి ఏంటనే ఆలోచన కూడా కాంగ్రెస్ అధిష్ఠానం మనసులో ఉంది.  ఇప్పటికే ఈ సీటు నుంచి రఘురామిరెడ్డి కాంగ్రెస్ పార్టీ తరుపున నామినేషన్ దాఖలు చేసారు. మరి ఎన్నికల నామినేషన్‌కు మరొక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ప్రియాంక వాద్రా తెలంగాణ నుంచి పోటీకి దిగుతుందా లేదా అనేది చూడాలి.

Also read: Pink Mooon: ఆకాశంలో అద్భుతం, తెల్లవారుజామునే పింక్ మూన్, ఎన్ని గంటలకంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News