సిద్ధరామయ్య ఓ అబద్ధాలకోరు: యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఓ అబద్ధాలకోరని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్నే యూపీ సీఎంపై సిద్ధరామయ్య పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 

Last Updated : May 5, 2018, 03:04 PM IST
సిద్ధరామయ్య ఓ అబద్ధాలకోరు: యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఓ అబద్ధాలకోరని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్నే యూపీ సీఎంపై సిద్ధరామయ్య పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన సొంత రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల 64 మంది చనిపోయినా, సీఎం మాత్రం కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వచ్చారని సిద్ధరామయ్య ఎద్దేవా చేశారు. చనిపోయిన వ్యక్తులకు తన ప్రగాఢ సంతాపమని.. ఇప్పటికైన యూపీ సీఎం మేల్కొని తన రాష్ట్రానికి వెళ్లి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని సిద్ధరామయ్య సూచించారు.

ఈ వ్యాఖ్యలను కర్ణాటక సీఎం ట్విట్టర్ ద్వారా చేశారు. అయితే ఈ వ్యాఖ్యలకు యోగి ఆదిత్యనాథ్ వివరణ ఇచ్చారు. "సిద్ధరామయ్య పూర్తిగా అబద్ధాలు చెబుతున్నారు. నేను మా రాష్ట్రంలో భారీగా పడిన వర్షాల వల్ల అతలాకుతలమైన ప్రాంతాలను దగ్గరుండి సమీక్షిస్తున్నాను. రేపే వాటి సందర్శనకు వెళ్తున్నాను కూడా" అని తెలిపారు

ఏఎన్ఐలో వచ్చిన వార్తల ప్రకారం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం రాత్రి ఆగ్రాకి వెళ్తారని.. అక్కడ నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లి సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారని సమాచారం. గతంలో కూడా యోగి ఆదిత్యనాథ్, సిద్ధరామయ్యల మధ్య ఇదే స్థాయిలో మాటల యుద్ధం జరిగింది. ఒకరినొకరు బహిరంగంగా విమర్శించుకున్నారు కూడా. 

Trending News