Yes Bank ఖాతాదారులకు గుడ్ న్యూస్

యస్ బ్యాంకులో (YES bank) మీకు ఎకౌంట్ ఉందా ? అయితే, ఈ గుడ్ న్యూస్ మీ కోసమే. యస్ బ్యాంక్ సంక్షోభంలో (Yes bank crisis) చిక్కుకున్న కారణంగా బ్యాంకు ఖాతాల ద్వారా జరిపే లావాదేవీలపై విధించిన ఆంక్షలు ఇవాళ్టితో తొలగిపోనున్నాయి. 

Last Updated : Mar 18, 2020, 01:45 PM IST
Yes Bank ఖాతాదారులకు గుడ్ న్యూస్

యస్ బ్యాంకు (Yes Bank)లో మీకు ఎకౌంట్ ఉందా ? అయితే, ఈ గుడ్ న్యూస్ మీ కోసమే. యస్ బ్యాంక్ సంక్షోభంలో చిక్కుకున్న కారణంగా బ్యాంకు ఖాతాల ద్వారా జరిపే లావాదేవీలపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) విధించిన ఆంక్షలు ఇవాళ్టితో తొలగిపోనున్నాయి. మార్చి 18, బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి ఆంక్షలు తొలగిపోనున్నాయి. దీంతో యస్ బ్యాంక్ ఖాతాదారులకు (Yes Bank account holders) పూర్తిస్థాయిలో ఇవాళ సాయంత్రం నుంచి బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

 

దేశవ్యాప్తంగా ఉన్న 1,132 బ్రాంచిలలో ఖాతాదారులు ఎక్కడైనా బ్యాంకింగ్ సేవలు వినియోగించుకోవచ్చునని యస్ బ్యాంక్ ప్రకటించింది. అంతేకాకుండా అన్ని డిజిటల్ లావాదేవీలు (Digital transactions) సైతం జరుపుకోవచ్చని యెస్ బ్యాంక్ ఈ ప్రకటనలో స్పష్టంచేసింది. 

Watch this video : యస్ బ్యాంక్ ఎందుకు సంక్షోభంలో పడింది ? యస్ బ్యాంక్ కస్లమర్ల పరిస్థితేంటి ? 

సంక్షోభంలో ఉన్న యస్ బ్యాంకుని తిరిగి పునరుద్దరించే ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం యస్ బ్యాంకు రీకన్‌స్ట్రక్షన్ స్కీమ్ (Yes Bank reconstruction scheme)ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. యస్ బ్యాంక్ పునఃనిర్మాణ పథకం తీసుకురావడం వల్లే ఆర్బీఐ యస్ బ్యాంకుపై విధించిన మోరటోరియం (Moratorium) ను ఎత్తేయడానికి అవకాశం కలిగింది. కొత్తగా ఏర్పాటైన బోర్డుకు ప్రశాంత్ కుమార్‌ని మేనేజింగ్ డైరెక్టర్ కమ్ సీఈఓగా నియమితులయ్యారు. యెస్ బ్యాంకు రీకన్‌స్ట్రక్షన్ స్కీమ్ మార్చి 13 నుంచి అమలులోకి వచ్చింది. ఈ మేరకు ఓ గెజిట్ నోటిఫికేషన్ సైతం వెలువడింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.

Trending News