మహిళలకే తొలి ప్రాధాన్యం: ప్రధాని మోదీ

మహిళలే ముందు అన్నది తమ ప్రభుత్వ విధానమని ప్రధాని మోదీ చెప్పారు.

Last Updated : May 5, 2018, 03:37 PM IST
మహిళలకే తొలి ప్రాధాన్యం: ప్రధాని మోదీ

మహిళలకే తొలి ప్రాధాన్యం అన్నది తమ ప్రభుత్వ విధానమని ప్రధాని మోదీ చెప్పారు. ‘మహిళలకే తొలి ప్రాధాన్యం’ అనే సిద్ధాంతంతో బీజేపీ, తమ ప్రభుత్వం నడుస్తున్నాయని అన్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు, నేతలతో ‘నమో యాప్‌’ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా దేశంలో మహిళల సంక్షేమం కోసం బీజేపీ ప్రారంభించిన పథకాలను ఆయన ప్రస్తావించారు. ‘మహిళా శక్తి’ అనే మంత్రాన్ని తాము విశ్వసిస్తామని చెప్పారు.

తన కేబినెట్‌లో అత్యంత కీలకమైన రక్షణ, విదేశాంగ మంత్రిత్వ శాఖలను మహిళలే నిర్వహిస్తున్నారని ఇటీవల చైనాలో జరిగిన ఎస్సీవో సదస్సులో పాల్గొన్న నిర్మలా సీతారామన్, సుష్మా స్వరాజ్‌ల ఫొటోను చూపించారు. వారిరువురికీ కర్ణాటకతో ఉన్న అనుబంధం గురించి చెప్పారు.  రక్షణ శాఖమంత్రి నిర్మలా సీతారామన్‌ కర్ణాటక నుంచే పార్లమెంటు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని..  విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ 1999లో కర్ణాటకలోని బళ్లారి నుంచి లోక్‌సభకు పోటీ చేసి సోనియా గాంధీపై విజయం సాధించారని గుర్తు చేశారు.  కర్ణాటక ఎన్నికల్లో బూత్ స్థాయి నుంచి పట్టుదలతో పనిచేసి అధికారం సాధించాలని మహిళా మోర్చా కార్యకర్తలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు.

Trending News