Madhya Pradesh: మనుషుల్లో మానవత్వం మంట కలుస్తుంది, మర్డర్ లు, మహిళలపై దాడులు, చిన్న పిల్లలపై మానభంగాలు... రోజు రోజుకు మానుషులు దిగజారిపోతూనే ఉన్నారు. జంతువు నుండి వచ్చిన మానవులు మళ్లీ జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు.
తాజాగా సైబరాబాద్ లో ఆరేళ్ల పాపపై (Saidabad Incident) జరిగిన అఘాయిత్యం, మహారాష్ట్రలో (Maharastra Incident) అటవీ ప్రాంతంలో ఒంటరి యువతిపై జరిగిన దాడి.. ఇలాంటి ఘటనలను చూస్తుంటే జంతువులూ కూడా ఇలా చేయవేమో అన్న ఆలోచన కలుగుతుంది.
Also Read: Shocking Viral Video: 'శరీరాన్ని వదిలి వెళ్లిపోతున్న ఆత్మ'... ఫన్నీ వైరల్ వీడియో!
పైన తెలిపిన వాఖ్యాలకు ఒక వీడియో అద్దం పడుతుంది.. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియోని చూస్తే ఇంకా మనిషి ఆలోచనలను రోజు రోజు దిగజారుతున్నయనే చెప్పొచ్చు. మధ్యప్రదేశ్‌లోని (Madya Pradesh) షాజాపూర్ (Shajapur) జిల్లాలో ఈ ఘటన జరిగింది.
అది మక్సి నగరం... పుష్పక్ భావ్సర్ (22) అనే యువకుడు, అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి ప్రేమించాడు. ఆ యువతికి కూడా అతడంటే ఇష్టం ఏర్పడి ఇద్దరు ప్రేమించుకున్నారు. వారిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాలు సభ్యులు అంగీకరించకపోవటంతో ఊరు విడిచి పారిపోయారు. రెండు కుటుంబ సభ్యుల పెద్దలు ఇద్దరికి ఘనంగా పెళ్లి చేస్తామని చెప్పి బ్రతిమాలి సొంత ఉరికి రప్పించారు.
అది నమ్మిన యువతి యువకుడు మక్సి నగరానికి తిరిగి వచ్చారు. వారిద్దరికి పెళ్లి చేస్తామని, మంచి ముహూర్థాలు వచ్చే వరకి, వేచి చూడాలని నమ్మపలికి ఎవరి ఇంటికి వారిని తీసుకెళ్లారు. కానీ, యువతి తల్లి తండ్రుల లోపల ఉన్న కోపాన్ని ప్రేమికులుద్దరు గమనించలేకపోయారు.
ఆదివారం నాడు ఎప్పటి లాగానే పుష్పక్ భావ్సర్ కూరగాయల కోసం అని మార్కెట్ కి వెళ్లాడు. ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం, యువతి తండ్రి మరియు సోదరుడు అతడిపై విరుచుకపడ్డారు. ఇద్దరు కలిసి సుత్తి, ఇనుపరాడ్‌తో విచక్షణారహితంగా దాడి చేసారు.
A 22-year-old man was brutally beaten up in Shajapur The woman's father and brother, allegedly angry over the affair, on Sunday confronted the man while he was out in the market and allegedly started beating him up with hammer-shaped rod. pic.twitter.com/GTrQ9JvMKp
— Anurag Dwary (@Anurag_Dwary) September 13, 2021
సుత్తితో యువకుడి కాలుపై బలంగా కొట్టడం, అతడు గట్టిగ అరవటం.. చుట్టూ చూస్తూ ఉన్న జనాలు ఆపకపోవటం.... నెటిజన్లను బాధకు గురి చేస్తుంది. తీవ్ర గాయాలైన యువకుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు కుటుంబ సభ్యులు.
ప్రపంచం టెక్నాలజీలో దూసుకుపోతున్న 2021 సంవత్సరంలో కూడా ఇలాంటి ఘటనలు, దాడులు రోజు జరగటం చాలా బాధాకరం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook