‘సీమా భవాని’ పేరుతో బీఎస్ఎఫ్ (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్)కు చెందిన మహిళా బైకర్ల జట్టు తొలిసారిగా భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొ్ంది. ఈ రోజు రాజ్‌పథ్ వేదికగా వీరు చేసిన ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. సెక్యూరిటీ దళాలకు చెందిన వనితలు ఇలాంటి ప్రదర్శన చేయడం భారతదేశ చరిత్రలోనే తొలిసారి కావడం విశేషం. మహిళా బైకర్ స్టాంజిన్ గైడెన్స్‌లో బీఎస్ఎఫ్లో పనిచేస్తున్న ఈ మహిళలు ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ అందరినీ అబ్బురపరిచారు. అయితే వీరందరూ యంగ్ గర్ల్స్ కావడం విశేషం. దాదాపు అందరూ 30 ఏళ్ళ కంటే తక్కువ వయసున్న వారే. రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ పై వీరు చేసిన సాహసోపేతమైన స్టంట్స్ అందరినీ ఆకట్టుకోవడం గమనార్హం. సెంట్రల్ స్కూల్ ఆఫ్ మోటార్ ట్రాన్స్పోర్ట్ సంస్థలో శిక్షణ తీసుకున్న ఈ మహిళా బైకర్లు ఎంతో ఛాలెంజింగ్‌గా తీసుకొని చేసిన ఈ ప్రదర్శనకు మంచి స్పందనే లభించింది.