MiG-21 Crash: రాజస్థాన్ లో కూలిన మిగ్-21 యుద్ధ విమానం.. వింగ్ కమాండర్ హర్షిత్ మృతి

MiG-21 Crash: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన మిగ్ - 21 ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఒకటి రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో వింగ్‌ కమాండర్ హర్షిత్‌ సిన్హా మృతిచెందినట్లు పేర్కొన్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 25, 2021, 06:48 AM IST
    • రాజస్తాన్ లోని జైసల్మేర్ లో కూలిన మిగ్-21 యుద్ధ విమానం
    • ప్రమాదంలో వింగ్ కమాండర్ హర్షిత్ సిన్హా మృతి
    • యుద్ద విమానం కూలడంపై విచారణకు ఆదేశించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్
MiG-21 Crash: రాజస్థాన్ లో కూలిన మిగ్-21 యుద్ధ విమానం.. వింగ్ కమాండర్ హర్షిత్ మృతి

MiG-21 Crash: భారత వాయుసేనకు చెందిన యుద్ధ విమానం మిగ్-21 రాజస్థాన్ లోని జైసల్మేర్ లో శుక్రవారం రాత్రి కూలింది. ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్  సీనియర్ అధికారులు సహా భారత వాయుసేన ధ్రువీకరించింది. ఈ ప్రమాదంలో వింగ్‌ కమాండర్ హర్షిత్‌ సిన్హా మృతిచెందినట్లు వాయుసేన ట్విట్టర్ లో పేర్కొంది.

అంతకు ముందు ప్రమాదం జరిగిందని ధ్రువీకరిస్తూ.. "ఈ సాయంత్రం (శుక్రవారం), రాత్రి 8.30 గంటల సమయంలో.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన MiG-21 విమానం శిక్షణలో భాగంగా పశ్చిమ సెక్టార్ కు వెళ్లింది. అయితే అది అనుకోకుండా ప్రమాదానికి గురైంది. మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది. దీనిపై విచారణకు ఆదేశిస్తున్నట్లు" భారత వాయుసేన ట్వీట్ చేసింది. 

జైసల్మేర్ లోని సామ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని డిసర్ట్​ జాతీయ పార్క్​ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు జిల్లా​ ఎస్పీ అజయ్​ సింగ్​ వెల్లడించారు. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న అజయ్ సింగ్.. స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని, తాను కూడా వెళుతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. అయితే మిగ్-21 కూలడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. 

మరోవైపు వింగ్ కమాండర్ హర్షిత్ సిన్హా మృతికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ శుక్రవారం సంతాపం తెలిపింది. "శుక్రవారం సాయంత్రం జరిగిన విమాన ప్రమాదంలో వింగ్ కమాండర్ హర్షిత్ సిన్హా మృతి చెందారనే విషయాన్ని తీవ్ర విచారంతో తెలియజేస్తున్నాం. ధైర్యవంతుల కుటుంబాలకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎప్పుడూ అండగా ఉంటుంది" అని భారత వాయుసేన ట్వీట్ చేసింది.  

కూనూరు ఘటనకు మరువకముందే..

ఇటీవల తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్ ప్రమాద ఘటన మరువకముందే మరో విమానం ప్రమాదానికి గురికావడం ఆందోళన కలిగిస్తోంది. తమిళనాడులో జరిగిన మిలిటరీ హెలికాప్టర్ ప్రమాదంలో మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, అతని భార్య మధులికా రావత్, బ్రిగేడియర్ లఖ్వీందర్ సింగ్ లిద్దర్, మరో 11 మంది మరణించిన కొద్ది వారాల తర్వాత ఈ సంఘటన జరగడం భారత వాయుసేనను కలవరానికి గురిచేస్తుంది.  

Also Read: Third Wave in India: ఫిబ్రవరి నాటికి ఇండియాలో కరోనా థర్డ్ వేవ్: ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు!

Also Read: Bijnor Gangrape: కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి.. స్నేహితురాలిపై గ్యాంగ్ రేప్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News