పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన త్రిపుల్ తలాక్ బిల్లులో ఏముంది ? 

పార్లమెంట్  ఉభయ సభలు త్రిపుల్ తలాక్ బిల్లును ఆమోదించాయి.

Last Updated : Jul 31, 2019, 01:14 PM IST
పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన  త్రిపుల్ తలాక్ బిల్లులో ఏముంది ? 

త్రిపుల్ తలాఖ్ బిల్లుకు పార్లమెంట్ ఉభయసభల నుంచి ఆమోదం లభించింది. ఇక రాష్ట్రపతి ఆమోదముద్రపడితే ఇది చట్టరూపం దాల్చుతుంది. ఈ నేపథ్యంలో త్రిపుల్ తలాక్ అంశం చర్చనీయంశంగా మారింది. త్రిపుల్ తలాక్ బిల్లులో ఏముందనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమౌతోంది. దీనికి గురించి తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే...

త్రిపుల్ తలాక్ అంటే...?
విడాకులు ఇవ్వడాన్ని ముస్లిం సమాజంలో తలాఖ్ గా సంభోదిస్తారు. తలాఖ్ ఇచ్చేందుకు అనేక రకాల పద్దతులు ఉన్నాయని మత పెద్దలు చెబుతున్నారు. ఇందులో తక్షణమే మూడు సార్లు తలాఖ్ (తలాక్ ఏ బిద్దత్‌) చెప్పి భార్య- భర్తలు విడాకులు తీసుకునే పద్దతి ఉందని తెలిపారు. అయితే ఈ పద్దతి మిస్ యూజ్ అవుతుందనేదే కేంద్ర ప్రభుత్వ వాదన. ఈ పద్దతిని అవలంభించి ముస్లిం సమాజంలో పురుషుడు తన భార్యకు విడాకులు ఇవ్వడాన్ని కేంద్రం తప్పుబడుతోంది...దీంతో మహిళా హక్కులకు భంగం కలుతుందనేదే కేంద్ర ప్రభుత్వ వాదన. ఈ నేపథ్యంలో తక్షణమే త్రిపుల్ తలాక్ చెప్పే పద్దతిని రద్దు చేసేందుకు మోడీ సర్కార్ త్రిపుల్ తలాఖ్  బిల్లును తెరపై తీసుకొచ్చింది.

బిల్లులోని ప్రధానాంశలు...

తక్షణమే ట్రిపుల్ తలాఖ్ లేదా తలాక్ ఏ బిద్దత్‌ నేరమని ఈ బిల్లులో ప్రధానంగా చెప్పబడింది .దీన్ని అనురించి భార్యకు తక్షణమే తలాక్ చెప్పి వదిలించుకోవడం నేరమని ఈ బిల్లులో చెప్పబడింది. ముస్లిం పురుషులు తక్షణం మూడుసార్లు తలాక్‌ చెప్పి భార్యలకు విడాకులిచ్చే పద్దతికి తాజా బిల్లుతో చెక్ పెట్టినట్లయింది. అలాగే ఎస్‌ఎంఎస్, వాట్సాప్, రాతపూర్వకంగా, నోటి మాటతో లేదా ఇతర ఏ మార్గం/పద్ధతిలో తక్షణమే మూడు సార్లు తలాఖ్ చెప్పినా ఆ చర్య నేరమని ఈ బిల్లు చెబుతోంది. ఇలాంటి పద్దతిని అనుసరించి విడాకులు తీసుకున్న ముస్లిం పురుషులకు మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా  నిబంధనలు వచ్చాయి.

ఫిర్యాదు చేయవచ్చు ఇలా...
తలాక్ ఏ బిద్దత్‌ లేదా త్రిపుల్ తలాఖ్ పద్దతిలో భర్త విడుకులు తీసుకుంటే బాధితురాలు మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించవచ్చు. అదే సమయంలో తనకు, తన మైనర్ పిల్లలకు పోషణ భత్యాన్ని ప్రకటించాలని భార్య కోరవచ్చు. ఎవరైనా ముస్లిం పురుషుడు తలాక్‌–ఏ–బిద్దత్‌ పద్ధతిలో భార్యకు విడాకులిచ్చాడని ఫిర్యాదు వస్తే వారంట్‌ లేకుండానే అతణ్ని అరెస్టు చేసే అధికారం పోలీసులకు ఈ బిల్లు కల్పిస్తోంది. 

మూడేళ్ల జైలు శిక్ష తప్పుదు

బాధిత మహిళ లేదా ఆమె రక్త సంబంధీకులు లేదా అత్తింటివారు ఫిర్యాదు చేస్తే మాత్రమే పోలీసులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. బాధిత మహిళ వాంగ్మూలాన్ని కూడా పరిశీలించిన తర్వాతనే జడ్జీలు అవసరం అనుకుంటే నిందితుడికి బెయిలు మంజూరు చేయవచ్చు. అవసరం లేదని భావించినట్లయితే తిరస్కరించవచ్చు. తక్షణమే త్రిపుల్ తలాఖ్ ఇచ్చినట్లు రుజువు అయితే నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశముంది. ఇదే సందర్భంలో విడాకుల అనంతరం తాను తన పిల్లలు బతకడానికి అవసరమైన భరణం ఇవ్వాలని భర్తను అడిగేందుకు మహిళలకు హక్కు ఉంటుంది.  

Trending News