లక్షణాలు లేని 'కరోనా వైరస్' కేసులు అంటే ఏమిటి..?

'కరోనా వైరస్' మహమ్మారితో ఇప్పుడు ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఈ వైరస్ ప్రభావంతో 24లక్షలకు పైగా ప్రజలు ఆస్పత్రులపాలయ్యారు. అందులో లక్షా 65 వేల మంది మృతి చెందారు. 'కరోనా వైరస్' మహమ్మారి దారుణంగా ప్రభావం చూపిస్తుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఐతే 'కరోనా వైరస్' కు సంబంధించి మరో భయంకరమైన నిజం వెలుగు చూసింది. 

Last Updated : Apr 20, 2020, 08:33 AM IST
లక్షణాలు లేని 'కరోనా వైరస్' కేసులు అంటే ఏమిటి..?

'కరోనా వైరస్' మహమ్మారితో ఇప్పుడు ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఈ వైరస్ ప్రభావంతో 24లక్షలకు పైగా ప్రజలు ఆస్పత్రులపాలయ్యారు. అందులో లక్షా 65 వేల మంది మృతి చెందారు. 'కరోనా వైరస్' మహమ్మారి దారుణంగా ప్రభావం చూపిస్తుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఐతే 'కరోనా వైరస్' కు సంబంధించి మరో భయంకరమైన నిజం వెలుగు చూసింది. 

నిజానికి 'కరోనా వైరస్' ఉంటే ఆ రోగికి .. కచ్చితంగా జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరస్ కు సంబంధించి మరో నిజం భయపెడుతోంది. అదే.. అసలు ఎలాంటి లక్షణాలు లేకుండా.. వ్యక్తులకు కరోనా వైరస్ సోకడం. దీన్నే లక్షణాలు లేని కరోనా వైరస్.. గా వ్యవహరిస్తున్నారు. వైద్య పరిభాషలో దీన్ని అసింప్టామాటిక్ అని పిలుస్తారు.   

భారత దేశవ్యాప్తంగా ఇప్పుడు ఈ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలో ఇలాంటి కేసులు 186 నమోదయ్యాయి. మహారాష్ట్రలో  నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో 75 శాతం ఇలాంటివే కావడం విశేషం. అలాగే కర్ణాటకలోనూ 60 శాతం ఇలాంటి కేసులు నమోదయ్యాయి. అంటే కర్ణాటకలో కరోనా వైరస్ లక్షణాలు ఉన్న కేసుల కంటే .. ఎక్కువగా 'లక్షణాలు లేని' కేసులే ఎక్కువగా నమోదయయ్యాన్నమాట. 

కరోనా వైరస్ ఉద్ధృతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో.. ఇప్పుడు లక్షణాలు కనిపించని కరోనా వైరస్ గుబులు రేకెత్తిస్తోంది. లక్షణాలు లేకుండా కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ ఉందని గుర్తించడం ఎలా..? అన్న ప్రశ్న ఇప్పుడు అందరినీ వేధిస్తోంది. జలుబు, దగ్గు, తలనొప్పి లాంటి లక్షణాలు లేనప్పటికీ.. శ్వాస తగ్గిపోవడం, వాసన గుర్తించే సామర్థ్యం తగ్గిపోవడం, రుచులు గుర్తించలేని లక్షణాలు కనిపిస్తే కరోనా వైరస్ మహమ్మారి ఇన్ఫెక్షన్ ఉందని సంకేతం. నిజానికి ఈ లక్షణాలను సాధారణంగా జనం పట్టించుకోరు. కానీ ఇలాంటి లక్షణాలను గుర్తిస్తే కరోనా పరీక్షలు చేయించుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. 

కరోనా వైరస్ ఉన్న వ్యక్తులు దగ్గరలో ఉన్నట్లయితే వారి నుంచి 40 నుంచి 50 శాతం వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. చుట్టు పక్కల ఉన్న వారికి లక్షణాలు కనిపించని వైరస్ వ్యాప్తి చెందుతుందని పరిశోధకులు చెబుతున్నారు. రెస్టారెంట్లు, ఆఫీసుల్లో ఉన్న ఎయిర్ కండిషన్ల ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందుతుందని చెబుతున్నారు. అలాంటప్పుడు చాలా మందిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించవని అంటున్నారు.

ప్రస్తుతం కరోనా వైరస్ పాజిటివ్ రోగులను ఐదు కేటగిరీలుగా విభజించారు పరిశోధకులు. రోగికి ఉన్న లక్షణాల ఆధారంగా అతని లేదా ఆమె కేటగిరీని నిర్ణయిస్తారు. కరోనా లక్షణ రహిత లక్షణాలు, తేలికపాటి లక్షణాలు, మిత లక్షణాలు, తీవ్రమైన లక్షణాలు, క్లిష్టమైన లక్షణాలు అని 5 కేటగిరీలుగా విభజించారు. ఇప్పుడు లక్షణ రహిత లక్షణాలు ఉన్న కేసులు ఎక్కువగా యువతలో వస్తున్నాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News