Flight Crash: మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం, ప్రమాదంపై ఏఏఐ ఏమంటోంది ?

కేరళ ( Kerala ) కొజికోడ్ ( Kozhikode Flight crash  విమాన ప్రమాదంలో మరణించినవారికి పది లక్షల పరిహారాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామన్నారు. త్వరలో విమానాశ్రయాన్ని పునరుద్ధరించడానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.

Last Updated : Aug 8, 2020, 04:49 PM IST
  • 2015లో రన్ వేలో సమస్యలున్నాయని గుర్తించిన ఏఏఐ
  • సమస్యల్ని పరిష్కరించి 2019లో అనుమతి
  • నిర్ధారిత రన్ వే పై ల్యాండింగ్ సమస్య తలెత్తడంతో మరో రన్ వే పై దింపే ప్రయత్నం
Flight Crash: మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం, ప్రమాదంపై ఏఏఐ ఏమంటోంది ?

కేరళ ( Kerala ) కొజికోడ్ ( Kozhikode Flight crash ) విమాన ప్రమాదంలో మరణించినవారికి పది లక్షల పరిహారాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామన్నారు. త్వరలో విమానాశ్రయాన్ని పునరుద్ధరించడానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.

కేరళ రాష్ట్రం కొజికోడ్ విమానాశ్రయంలో ( Kozhikode airport ) జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ( kerala cm p vijayan ) ప్రకటించారు. కరిపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ( karipur internatinal airport ) జరిగిన విమాన ప్రమాదంలో 18 మంది మరణించగా...149 మందికి గాయాలయ్యాయి. ఇందులో 23 మంది ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారు. 190 మంది ప్రయాణీకులతో దుబాయ్ నుంచి కేరళలోని కొజికోడ్ వస్తున్న ఇండియన్ ఎయిర్ లైన్స్  కు చెందిన విమానం ల్యాండింగ్ అవుతుండగా స్కిడ్ అయి క్రాష్ అయి సమీపంలోని లోయలో పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో విమానం రెండు ముక్కలైంది. ఈ ఘటనకు సంబంధించి రెండు బ్లాక్ బాక్స్ లను స్వాధీనం చేసుకున్నామని విమానయాన శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పూరి తెలిపారు. బ్లాక్ బాక్స్ ( Black boxes ) ఆధారంగా డేటాను విశ్లేషించి ప్రమాదానికి కచ్చితమైన కారణాన్ని కనుగొంటామన్నారు. Also read: Best cm Survey: టాప్ లో ఆ ముగ్గురు సీఎంలు: కరోనా పోరులో పైచేయి

ఎయిర్ పోర్ట్ అథారిటీ ఏమంటోంది

ఈ విమానాశ్రయ రన్ వే లో కొన్ని సమస్యలున్నాయని 2015లో గుర్తించామని..అనంతరం వాటిి పరిష్కరించి 2019లో క్లియరెన్స్ కూడా ఇచ్చామని ఎయిర్ పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ అరవింద్ సింహ్ తెలిపారు. వాస్తవానికి నిర్ధారిత రన్ వే పై విమానం ల్యాండ్ కాలేకపోవడంతో మరో రన్ వే పై దిగడానికి ప్రయత్నించినప్పుడు ఈ ఘటన జరిగిందని ఎయిర్ పోర్ట్ అధారిటీ తెలిపింది. పరిస్థితిని సమీక్షిస్తున్నామని త్వరలోనే పునరుద్ధరిస్తామని ఏఏఐ ఛైర్మన్ వెల్లడించారు. Also read: Corona Alert: కరోనాను జయించారా..ఆ సమస్యలు పొంచి ఉన్నాయి జాగ్రత్త

 

Trending News