కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన 60 ఏళ్ల సీనియర్ వైద్యుడు వారం రోజుల క్రితం పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. కాగా kolkataలోని ఆసుపత్రిలో చేరాడు. ఈ రోజు ఉదయం కోల్‌కతాలో సీనియర్ వైద్యుడు మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటివరకు పశ్చిమ బెంగాల్ ఆరోగ్య సేవా విభాగంలో పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ బిప్లాబ్ కాంతి దాస్‌గుప్తా, రాష్ట్రంలో COVID-19తో మరణించిన మొదటి వైద్యుడు. మరోవైపు డాక్టర్ భార్య కూడా COVID-19 పాజిటివ్ అని తేలగా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
Also Read: రేపు నిరాడంబరంగా టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు
వైద్యుడి మృతికి గాను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి Mamata benarjeeనివాళులు అర్పిస్తూ ట్వీట్ చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆయన మన కోసం చేసిన త్యాగం మన హృదయాల్లో ఎప్పుడూ ఉంటుందని అన్నారు. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్ వైద్యుల ఫోరం డాక్టర్ మరణానికి సంతాపం తెలిపింది. అతని భార్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.
We have lost Dr Biplab Kanti Dasgupta
Assistant Director, Health Services, West Bengal in the early hours of today.He was Assistant Director of Health Services, Central Medical Stores.
We are deeply pained with his untimely demise. (1/2)— Mamata Banerjee (@MamataOfficial) April 26, 2020
Read Also: వృద్ధురాలు సజీవ దహనం..!!
ఇదిలాఉండగా రాష్ట్రవ్యాప్తంగా సీనియర్ వైద్యుడి మృతి అనంతరం పలుచోట్ల ఆసుపత్రుల్లో భయాందోళనలకు గురవుతున్నారని, మాకు మరింత Intensive Testingఅవసరమని ఫోరం ఒక లేఖలో తెలిపింది. ఇప్పటివరకు 8 మరణాలతో బెంగాల్‌లో 600కి పైగా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..