వినియోగదారులకు షాకిచ్చిన వోడాఫోన్ ఐడియా(Vodafone idea), ఎయిర్‌టెల్(Airtel)

మొబైల్‌ వినియోగదారులకు భారతీ ఎయిర్‌టెల్‌(Airtel), వొడాఫోన్‌ ఐడియా(Vodafone Idea) షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యాయి. డిసెంబర్ 1వ తేదీ నుంచి మొబైల్‌ సర్వీసులకు సంబంధించి కాల్‌, డేటా చార్జీలను పెంచనున్నట్టు ప్రకటించి భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా బాంబు పేల్చాయి.

Last Updated : Nov 19, 2019, 06:25 PM IST
వినియోగదారులకు షాకిచ్చిన వోడాఫోన్ ఐడియా(Vodafone idea), ఎయిర్‌టెల్(Airtel)

న్యూ ఢిల్లీ: మొబైల్‌ వినియోగదారులకు భారతీ ఎయిర్‌టెల్‌(Airtel), వొడాఫోన్‌ ఐడియా(Vodafone Idea) షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యాయి. డిసెంబర్ 1వ తేదీ నుంచి మొబైల్‌ సర్వీసులకు సంబంధించి కాల్‌, డేటా చార్జీలను పెంచనున్నట్టు ప్రకటించి భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా బాంబు పేల్చాయి. తమ వినియోగదారులకు ప్రపంచ స్థాయి డిజిటల్‌ అనుభూతిని అందించేందుకే టారిఫ్‌ను పెంచుతున్నామని వొడాఫోన్ ఐడియా స్పష్టంచేసింది. అయితే, గడిచిన త్రైమాసికంలో భారీ స్థాయిలో నష్టాలు వచ్చిన కారణంగానే ఇక తప్పనిసరి పరిస్థితుల్లోనే చార్జీలు పెంచడం ద్వారా భవిష్యత్ నష్టాలను తగ్గించుకోవాలనేది వారి ఆలోచనగా తెలుస్తోంది. 

టెలికం రంగంలో ఈ రెండు సంస్థలకంటే ఆలస్యంగా వచ్చిన రిలయన్స్ జియో(Reliance Jio).. వస్తూనే రెవిన్యూ పట్టికలో అగ్రభాగాన నిలిచింది. రెవిన్యూ పరంగా ముందంజలో ఉన్న రిలయన్స్ జియో టారిఫ్స్ తగ్గింపు విషయంలోనూ భారీ ఆఫర్స్ ప్రకటించడంతో మిగతా సంస్థలకు కూడా జియో బాటలోనే వెళ్లక తప్పలేదు. కానీ ఈసారి మాత్రం అందుకు భిన్నంగా రిలయన్స్ జియోతో సంబంధం లేకుండా వోడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్‌టెల్ సంస్థలు టారిఫ్స్ పెంచుతున్నట్టు ప్రకటించడం టెలికాం ఇండస్ట్రిలో భిన్నంగా కనిపిస్తోంది. 

ఇదిలావుంటే, ఈ రెండు సంస్థల నిర్ణయంపై రిలయన్స్ జియో ఎలా స్పందించనుందా అనేదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అంతేకాకుండా వోడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్‌టెల్ సంస్థలు తమ టారిఫ్స్ పెంచడంపై వినియోగదారుల నుంచి ఎలాంటి స్పందన రానుంది ? ఇప్పటికే టెలికాం రంగంలో తీవ్రమైన పోటీ నెలకొన్న ప్రస్తుత తరుణంలో ధరల పెంపు నిర్ణయం ఆ రెండు సంస్థల వ్యాపారంపై ఎలాంటి ప్రభావం చూపనుందనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Trending News