BMTC Bus Fire: బస్సులో చెలరేగిన భారీ మంటలు.. తృటిలో తప్పించుకున్న 25 మంది ప్రయాణికులు (వీడియో)!!

బెంగళూరు బీఎమ్‌టీసీ బస్సులో ఒక్కరిగా భారీ మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్.. వెంటనే బస్సులోని ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో అందరూ బ్రతికిబయటపడ్డారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 2, 2022, 05:29 PM IST
  • బస్సులో చెలరేగిన భారీ మంటలు
  • తృటిలో తప్పించుకున్న 25 మంది ప్రయాణికులు
  • కేసు నమోదు చేసిన పోలీసులు
BMTC Bus Fire: బస్సులో చెలరేగిన భారీ మంటలు.. తృటిలో తప్పించుకున్న 25 మంది ప్రయాణికులు (వీడియో)!!

BMTC bus catches fire in Bengaluru: కదులుతున్న బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బీఎమ్‌టీసీ) బస్సులో ఒక్కరిగా భారీ మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్.. వెంటనే బస్సులోని ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో అందరూ బ్రతికిబయటపడ్డారు. అయితే ఈ ప్రమాదంలో బస్సు ముందుభాగం పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటన బెంగళూరు నగరం జయనగర్‌లోని సౌత్ ఎండ్ సర్కిల్ సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... 

మంగళవారం మధ్యాహ్నం బీఎమ్‌టీసీ బస్సు ఒకటి 25 మంది ప్రయాణికులతో బయలుదేరింది. జయనగర్‌లోని సౌత్ ఎండ్ సర్కిల్ సమీపంలోకి రాగానే బస్సులో మంటలు చెలరేగాయి. ఇంజన్ బానెట్ కింద నుంచి పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ కెంపరాజు బస్సును నందా థియేటర్ వద్ద రోడ్డుపైనే ఆపి కండక్టర్ మంటప్పను అప్రమత్తం చేశాడు. అతడు ప్రయాణికులకు విషయం చెప్పడంతో అందరూ బస్సులోంచి దిగిపోయారు. 

ప్రయాణీకులలో ఒకరు అగ్నిమాపక అధికారులకి సమాచారం ఇవ్వడంతో.. అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేశారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. ప్రయాణికులు, డ్రైవర్ మరియు కండక్టర్ సకాలంలో బస్సు నుండి బయటకు రావడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ప్రమాదంలో బస్సు ముందుభాగం పూర్తిగా కాలిపోయింది.

ఈ ఘటనపై జయనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బ్యాటరీలలో షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సులో మంటలు చెలరేగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బీఎమ్‌టీసీ అధికారి డెక్కన్ హెరాల్డ్‌తో మాట్లాడుతూ.. బస్సును 2014లో ప్రముఖ తయారీదారు నుంచి కొనుగోలు చేశామని తెలిపారు. అయితే కరోనా వైరస్ ఆంక్షల నేపథ్యంలో బస్సును ఎక్కువగా వాడలేదని తెలిపారు. జనవరి 21న కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. చామరాజ్‌పేటలోని మక్కలకూట సమీపంలో బీఎంటీసీ బస్సులో మంటలు చెలరేగగా.. 40 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

Also Read: Amritha Aiyer: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఇన్‌స్టా అకౌంట్ హ్యాకింగ్.. పోలీసులకు ఫిర్యాదు!!

Also Read: Viral Video: హైవే రోడ్డుపై 4 కిమీ మండుతూ వెళ్లిన ట్రక్కు.. చివరకు ఏమైందంటే? (వీడియో)!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News