Yogi Adityanath Temple: అభిమానం వేరే లెవల్.. సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఆలయం.. రోజూ పూజలు..

Yogi Adityanath Temple: యూపీ సీఎంకు ఆలయాన్ని నిర్మించాడు ఓ అభిమాని. అంతేకాకుండా యోగి విగ్రహానికి రోజుకు పూజలు చేస్తూ.. ప్రసాదాలను అందరికీ పంచిపెడుతున్నాడు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 20, 2022, 08:39 AM IST
Yogi Adityanath Temple: అభిమానం వేరే లెవల్..  సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఆలయం.. రోజూ పూజలు..

Yogi Adityanath Temple : యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్ కు గుడికట్టి ఆయనపై తనకు గల అభిమానాన్ని చాటుకున్నాడు ఓ వ్యక్తి. అంతేకాకుండా యోగి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేస్తున్నాడు. 

వివరాల్లోకి వెళితే...
ఉత్తరప్రదేశ్ లోని మౌర్య పూర్వా గ్రామానికి చెందిన ప్రభాకర్ మౌర్యకు యోగి ఆదిత్యనాథ్ అంటే అమితమైన ఇష్టం. అందుకు ఆయన కోసం అయోధ్యకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న భరత్‌కుండ్ అనే ప్రాంతంలో ఫైజాబాద్-ప్రయాగ్​రాజ్​ హైవే పక్కన యోగి ఆదిత్యనాథ్ ఆలయాన్ని (Yogi Adityanath Temple ) నిర్మించారు. ఈ గుడిలో యోగి ప్రతిమనే దేవుడి రూపంలో ప్రతిష్టించి, నిత్యం పూజలు చేస్తున్నాడు. ఇక్కడ యోగి విగ్రహాన్ని శ్రీరాముడు చేతిలో విల్లు, భుజంపై బాణం పట్టుకుని ఉన్న విధంగా రూపొందించాడు. ఈ ఆలయానికి శ్రీ యోగి మందిర్ అని పేరు పెట్టారు. ఇక్కడ రోజుకు రెండు సార్లు పూజలు చేస్తూ...సీఎంకి హారతి పడతారు. 

ప్రభాకర్ మౌర్య మాట్లాడుతూ..  ''సీఎం యోగి పని చేస్తున్న తీరు పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. అయోధ్యలో రామమందిరం కట్టిన వారి పేరు మీద గుడి కట్టిస్తానని గతంలో సంకల్పించుకున్నాను. అందుకే  శ్రీ యోగి మందిరాన్ని నిర్మించాను'' అని చెప్పుకొచ్చాడు. తనకు జాబ్ కానీ, భూమి కానీ లేదని చెప్పిన ప్రభాకర్ తనకు యూట్యూబ్ ద్వారా నెలకు రూ.లక్ష వరకు ఆదాయం వస్తుందని చెప్పాడు. ఈ సొమ్ముతోనే తాను గుడి నిర్మించినట్లు తెలిపాడు. 

Also Read: Hanuman idol binked Eyes: మధ్యప్రదేశ్​లో అద్భుతం.. కళ్లు ఆర్పిన హనుమంతుడు.. వైరల్ అవుతున్న వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News