ప్రాణాలు కాపాడిన ఏనుగులకు సగం ఆస్తి రాసిచ్చాడు

తన ప్రాణాలు కాపాడిన ఏనుగులకు ఏకంగా తన ఆస్తిలో సగం వాటా రాసిన వ్యక్తి కథ వైరల్ అవుతుంది. కేరళలో ఏనుగు చనిపోవడంతో ఏనుగులకు సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి.

Last Updated : Jun 10, 2020, 07:02 PM IST
ప్రాణాలు కాపాడిన ఏనుగులకు సగం ఆస్తి రాసిచ్చాడు

ఇటీవల గర్భంతో ఉన్న ఏనుగు (Kerala Elephant)కు పైనాపిల్‌లో పటాసులు పెట్టడంతో అది చనిపోవడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఏనుగు మరణానికి కారణమైన వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని నిరసనలు వెల్లువెత్తాయి. కేంద్ర ప్రభుత్వం సైతం ఏనుగు ఘటనపై స్పందించింది. కేరళ ప్రభుత్వం సైతం సీరియస్‌గా తీసుకుని విచారణకు ఆదేశించగా కొందరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో 2 ఏనుగులకు తన సగం ఆస్తి రాసిచ్చి ప్రాణాలమీదకు తెచ్చుకున్న బిహార్ వ్యక్తి విషయం వైరల్ అవుతోంది. టీడీపీకి భారీ షాక్.. వైసీపీలో చేరిన శిద్దా రాఘవరావు

ఆ వివరాలిలా ఉన్నాయి... ఏషియన్ ఎలిఫెంట్ రిహాబిలిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ ట్రస్ట్ (AERAWT) చీఫ్ మేనేజర్ అక్తర్ ఇమామ్ జాతీయ మీడియా ఏఎన్ఐతో మాట్లాడారు. రెండు ఏనుగుల బాధ్యతను గత 12 ఏళ్లుగా సక్రమంగా నిర్వహిస్తున్నట్లు తెలిపాడు. ఈ క్రమంలో ఓరోజు గుర్తు తెలియని వ్యక్తి రివాల్వర్‌తో నన్ను చంపాలని చూడగా ఏనుగులు తన ప్రాణాల్ని కాపాడాయని హర్షం వ్యక్తం చేశాడు. రివాల్వర్‌తో తన గదిలోకి ఆ వ్యక్తి ప్రవేశిస్తుండగా ఏనుగులు తనను నిద్రలేపాయని, దాంతో విషయాన్ని గ్రహించి గట్టిగా కేకలు వేయడంతో దుండగుడు పరారయ్యాడని చేదు విషయాన్ని షేర్ చేసుకున్నారు. నిమ్మరసం తాగుతున్నారా.. ఇది తెలుసుకోండి

వాస్తవానికి తన ప్రాణాల్ని కాపాడిన ఏనుగులకు ఆస్తిలో సగం వాటా అందేలా వీలునామా రాశాడు. దీంతో కుటుంబం తనను దూరం పెట్టిందని ఇమామ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన కొడుకు కోర్టుకీడ్చాలని చూసి భంగపడ్డాడని తెలిపాడు. తన ఆస్తిలో సగం వాటా భార్య పేరిట రాయగా, తన వాటా రూ.5కోట్లను ఏనుగుల పేరిట రాశానని.. వీటి మరణానంతరం ఈ ఏనుగులు, వన్యప్రాణుల సంరక్షణ పునరావాస కేంద్రానికి చెందేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు ఇమామ్ తన కథను వివరించారు. (Bihar Man wills Half Of His Property to Elephants) జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
నటి మీరా చోప్రా హాట్ ఫొటోలు వైరల్

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x