Under-15 National Wrestling Championship: భాజపా ఎంపీ..ఓ రెజ్లర్ ను చెంపదెబ్బ కొట్టాడు. ఝార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగిన జాతీయ ఛాంపియన్షిప్ ఈవెంట్లో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.
యూపీలోని కైసర్‌గంజ్ నియోజకవర్గం(Kaiserganj constituency) నుంచి ఎంపీగా ఉన్నారు భాజపాకు చెందిన బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్(Brijbhushan Sharan Singh). ఆయన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడు కూడా. రాంచిలో జరుగుతోన్న అండర్-15 జాతీయ రెజ్లింగ్ ఛాంపియన్షిప్( Under-15 National Wrestling Championship) మొదటిరోజున ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు.
Also Read: 16 ఏళ్లకే రజస్వల అయితే... మహిళల వివాహ వయసు పెంపుపై ఎస్పీ ఎంపీ షాకింగ్ కామెంట్స్
ఆ పోటీలు షహీద్ గణపత్ రాయ్ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్నాయి. ఈ పోటీల్లో ఓ రెజ్లర్(wrestler)కు వయసు ఎక్కువగా ఉండటంతో ఆడేందుకు అనుమతించలేదు. దీంతో తనకు అనుమతినివ్వాలని పదే పదే ఎంపీ(BJP MP)ని కోరాడు. దీంతో సహనం కోల్పోయిన ఎంపీ..ఆ ఆటగాడి చెంప చెళ్లుమనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారడంతో...ఎంపీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
As instructed by @narendramodi , his MP started to train the wrestlers on the stage itself. Preparation for the next Olympics is at next level. #brijbhushansharansingh pic.twitter.com/Qf313HBzMs
— Rofl Gandhi 2.0 🚜🏹 (@RoflGandhi_) December 18, 2021
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి