Gyanvapi Mosque: మసీదు కమిటికి బిగ్ ట్విస్ట్.. జ్ఞాన్‌వాపిలో హిందువుల పూజలపై స్టేకు నిరాకరించిన అలహబాద్ హైకోర్టు..

Allahabad High Court: హిందువుల పూజలు చేసుకోవద్దని మసీదు కమిటీ అలహబాద్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన ధర్మాసనం మసీదు కమిటీకి ట్విస్ట్      ఇచ్చింది.  హిందువులు పూజలు చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

Written by - Inamdar Paresh | Last Updated : Feb 2, 2024, 06:01 PM IST
  • - మసీదు కమిటీకి హైకోర్టులో చుక్కెదురు..
    - హిందుపూజలపై స్టేకు నిరాకరణ..
    - శాంతి భద్రతలను కాపాడాలని ఆదేశాలు..
Gyanvapi Mosque: మసీదు కమిటికి బిగ్ ట్విస్ట్.. జ్ఞాన్‌వాపిలో హిందువుల పూజలపై స్టేకు నిరాకరించిన అలహబాద్ హైకోర్టు..

Allowing Hindu Prayers In Gyanvapi: శుక్రవారం అలహబాద్ హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దాదాపు 31 ఏళ్ల తర్వాత వారణాసిలోని సౌత్ సెల్లార్ లో పూజలు చేసుకోవడానికి వారణాసి డిస్ట్రిక్ట్ కోర్టు ఇది వరకు అనుమతి ఇచ్చింది. దీంతో వెంటనే ఆలయం తెరిచి, జిల్లా అధికారులతోపాటు, వారణాసి ఆలయ పూజారులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే మసీదు కమిటీ అంజుమన్ ఇంతేజామియా వెంటనే కల్గజేసుకుని సుప్రీమ్ కోర్టు ను ఆశ్రయించింది.

సుప్రీమ్ ధర్మాసనం మసీదు కమిటీ అలహబాద్ హైకోర్టును  ఆశ్రయించారు. ఆ తర్వాత.. హిందువులు పూజలు వెంటనే ఆపేయాలని మసీదు కమిటీ సభ్యులు  పిటిషన్ ను దాఖలు చేశారు. దీనిపై విచారించిన జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ తో కూడిని సింగిల్ బెంచ్.. మసీదులో చుట్టుపక్కల ప్రాంతంలో శాంతి భద్రతలను నిర్వహించాలని అడ్వకేట్ జనరల్ ను ఆదేశించింది.

అదే విధంగా హిందువుల పూజలకు అనుమతినిస్తు కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 6 కు వాయిదా వేసింది. ప్రస్తుతం అనేక మంది శివుడి భక్తులు అక్కడకు జ్ఞాన్‌వాపిలో పూజలు చేసుకుంటున్నారు. అదే విధంగా శుక్రవారం కావడంతో శాంత్రి భద్రతల సమస్యలు తలెత్తకుండా అదనపు పోలీసు బలగాలను మోహరించారు. 

Read Also: Snakes: ఈ చెట్లంటే పాములు పడిచస్తాయంట.. ఇవి ఇంట్లో ఉంటే పాములకు గ్రీన్ కార్పెట్ వేసినట్లే..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News