UPSC Mains Result 2022: యూపీఎస్సీ మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇటీవల సెప్టెంబర్ నెల 16 నుంచి 25 వ తేదీ వరకు జరిగిన యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in లోకి లాగిన్ అవడం ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. లేదా upsconline.nic.in వెబ్‌సైట్ ద్వారా కూడా పరీక్ష పలితాలు ఛెక్ చేసుకోవచ్చు అని యూపీఎస్సీ వెల్లడించింది.
ఈ మెయిన్స్ పరీక్షల్లో అర్హత సాధించిన వారు ఇంటర్వ్యూ రౌండ్‌కి ఎంపిక అవుతారు అనే విషయం తెలిసిందే. 2023 ఆరంభంలో యూపీఎస్సీ ఇంటర్వ్యూలు జరగనున్నాయి. తాజాగా మెయిన్స్ ఫలితాలు వెల్లడయిన నేపథ్యంలో త్వరలోనే ఇంటర్వ్యూ తేదీలు సైతం ప్రకటించే అవకాశం ఉంది.
యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ పరీక్ష ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలంటే..
యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in లేదా upsconline.nic.in వెబ్‌సైట్ హోమ్ పేజీలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ రిజల్ట్ 2022 అనే లింకుపై క్లిక్ చేయండి. ఒక పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. అందులో మీ పేరు, అడ్మిట్ కార్డు నెంబర్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి. తరువాతి అవసరాల కోసం పీడీఎఫ్ ఫైలుని డౌన్ లోడ్ చేసి స్టోర్ చేసుకోండి. యూపీఎస్సీ మెయిన్స్ లో పేపర్, పేపర్ బి ఉంటాయి. మౌఖిక పరీక్షకు అర్హత సాధించాలంటే.. ఈ రెండు పేపర్లలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి : MHSRB Jobs Notification 2022: వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
ఇది కూడా చదవండి : Ys Sharmila: థ్యాంక్యూ మోదీ జీ.. ప్రధాని ఫోన్ కాల్‌పై వైఎస్ షర్మిల రియాక్షన్ ఇదే..
ఇది కూడా చదవండి : TS Eamcet: ఇంటర్మీడియట్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇక నుంచి ఫ్రీఎంసెట్ కోచింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook