యూపీ ఇన్వెస్టర్స్ సమ్మిట్ -2018 విశేషాలు

ఢిల్లీ రోడ్ షోలో భాగంగా ఈ నెల 8వ తేదీన జరిగిన ఉత్తరప్రదేశ్ పెట్టుబడుదారుల శిఖరాగ్ర సమావేశం - 2018 కు సంబంధించిన కర్టెన్ రైజర్‌ కార్యక్రమాన్ని ఆ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ది  మంత్రి శ్రీ సతీష్ మహానా ఘనంగా ప్రారంభించారు. 

Last Updated : Dec 11, 2017, 12:58 PM IST
యూపీ ఇన్వెస్టర్స్ సమ్మిట్ -2018 విశేషాలు

ఢిల్లీ రోడ్ షోలో భాగంగా ఈ నెల 8వ తేదీన జరిగిన ఉత్తరప్రదేశ్ పెట్టుబడుదారుల శిఖరాగ్ర సమావేశం - 2018 కు సంబంధించిన కర్టెన్ రైజర్‌ కార్యక్రమాన్ని ఆ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ది  మంత్రి శ్రీ సతీష్ మహానా ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  శ్రీ అనూప్ చంద్ర పాండే (మౌలిక వనరుల శాఖ కమీషనర్), శ్రీ అలోక్ సిన్హా (ప్రిన్సిపల్ సెక్రటరీ, మౌలిక వనరులు మరియు పారాశ్రామికాభివృద్ధి శాఖ), శ్రీ దేవాశిష్ పాండా (సీఈఓ, గ్రేటర్ నోయిడా), శ్రీమతి అలకనంద దయాల్ (సెక్రటరీ,  మౌలిక వనరులు మరియు పారాశ్రామికాభివృద్ధి శాఖ), శ్రీ రణ్ వీర్ ప్రసాద్ (ఎండీ, యూపీఎస్‌ఐడీసీ) తదితరులు పాల్గొన్నారు. 

ఈ సమావేశానికి దాదాపు 350 అతిధులు హాజరయ్యారు. శ్రీ అల్ఫోన్సస్ స్టోలింగా (నెదర్లాండ్స్ అంబాసిడర్), శ్రీ ఆర్ సి భార్గవ (ఛైర్మన్, మారుతి సుజుకీ ఇండియా), శ్రీ కన్వల్జిత్ జావా (ఎండీ, దైకిన్ ఎయిర్ కండీషనింగ్ ఇండియా లిమిటెడ్), శ్రీ సమీర్ గుప్తా (ఛైర్మన్, జాక్సన్ ఇంజినీర్స్ లిమిటెడ్), శ్రీ ప్యాట్రిక్ ఆంథోని (డిప్యూటీ కంట్రీ మేనేజర్, ఐకేఈఏ గ్రూప్), శ్రీ రజనీష్ కుమార్ (సీనియర్ వైస్ ప్రెసిడెంట్, వాల్ మార్ట్ ఇండియా), శ్రీ రోనల్ కే (సీఎఫ్‌ఎల్‌డీ) మొదలైన ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

ఈ సమావేశం సందర్భంగా ప్రభుత్వ సంస్థలకు, ప్రైవేటు సంస్థలకు మధ్య పరస్పర ఒప్పందాల మీద అవగాహన చర్చలు కూడా జరిగియి. అలాగే సంస్థల ప్రతినిధులు ఒకరితో ఒకరు అభిప్రాయాలు కూడా పంచుకున్నారు. భవిష్యత్తులో ఎలాంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలన్న అంశంపై కూడా చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ శ్రీకాంత్ సోమని (ఛైర్మన్, ఎండీ, సోమనీ సిరామిక్స్ లిమిటెడ్) మాట్లాడుతూ యూపీ రాష్ట్రానికి సంబంధించి సమకాలీన పాలసీల వల్ల పెట్టుబడులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఆయన ప్రస్తుతంసూరజ్ పూర్ పారిశ్రామిక ప్రాంతంలో సంస్థను నడుపుతున్నారు.

ఈ సమావేశం సందర్భంగా యూపీ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లోగో మరియు వెబ్ సైట్‌ని కూడా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా  శ్రీ అలోక్ సిన్హా (ప్రిన్సిపల్ సెక్రటరీ, మౌలిక వనరులు మరియు పారాశ్రామికాభివృద్ధి శాఖ) మాట్లాడుతూ రాష్ట్రంలో బయటి వ్యక్తులు పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేయడానికి సంబంధించిన పాలసీలను రూపొందించామని తెలిపారు.

అలాగే   శ్రీ అనూప్ చంద్ర పాండే (మౌలిక వనరుల శాఖ కమీషనర్) మాట్లాడుతూ పెట్టుబడులు ఆహ్వానించడానికి యూపీ ఎల్లప్పుడూ సిద్ధమే అని పేర్కొన్నారు. ప్రస్తుతం పెట్టుబడిదారుల సమస్యలను తీర్చడం కోసం, వారికి అవగాహన కల్పించడం కోసం ప్రతీ నెలా ఉద్యోగ్ బంధు మీటింగ్స్ కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇదే కార్యక్రమంలో శ్రీ దేవాశిష్ పాండా (సీఈఓ, గ్రేటర్ నోయిడా) మాట్లాడుతూ, కొత్త వ్యాపారస్తులకు నోయిడా ఎంత ప్రభావవంతమైన ప్రాంతమో తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి హాజరైన శ్రీ సతీష్ మహానా (యూపీ పారిశ్రామికాభివృద్ధి మంత్రి) మాట్లాడుతూ ప్రభుత్వం యూపీలో నూతన పెట్టుబడులు రావడానికి రాష్ట్రం తరఫున ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఎంప్లాయ్ మెంట్ పాలసీ 2017ను రూపొందించిందని తెలిపారు. ముఖ్యంగా యూపీ ప్రాంతాలు నేరపూరిత వాతావరణానికి దూరంగా ఉండేలా చర్యలు తీసుకుంటూ.. ఎల్లప్పుడూ వ్యాపారవేత్తలకు స్వర్గధామంగా మార్చాలన్నదే తమ అభిమతమని మంత్రి పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ పెట్టుబడుదారుల శిఖరాగ్ర సమావేశం ఫిబ్రవరి 21, 22 తేదీల్లో యూపీ రాజధాని లక్నోలో జరగనుంది. 

ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో తదుపరి రోడ్ షో కార్యక్రమం 18 డిసెంబరు, 2017 తేదీన బెంగళూరులో జరగనుంది. ఆ తర్వాత అదే కార్యక్రమం హైదరాబాద్, అహ్మదాబాద్, ముంబయి మరియు కోల్‌‌కతా ప్రాంతాల్లో కూడా జరగనుంది.  

Trending News