Unlock: కరోనా మహమ్మారి ఉధృతి తగ్గే కొద్దీ నిబంధనల్ని సడలిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ లాక్డౌన్ నుంచి బయటపడేందుకు సన్నాహాలు చేస్తోంది. అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) ఉధృతి నెమ్మదిగా తగ్గుముఖం పడుతోంది. వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న లాక్డౌన్ లేదా కర్ఫ్యూని సడలించే పరిస్థితులు కన్పిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 50 రోజుల తరువాత లాక్డౌన్ తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత కొద్దిరోజులుగా కేసులు తగ్గుతుండటంతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Arvind kejriwal) ఇప్పుడు అన్‌లాక్ ప్రక్రియపై దృష్టి సారించారు. ముందుగా మెట్రో రైళ్లలో 50 శాతం ప్రయాణీకుల్ని అనుమతించడంతో పాటు సరి, బేసి విధానంలో మార్కెట్ తెర్చుకునేందుకు అనుమతించారు. ఈ సడలింపు నిబంధనలు జూన్ 14 వరకూ కొనసాగనున్నాయని చెప్పారు.
మరోవైపు ప్రైవేటు సంస్థలకు 50 శాతం అనుమతితో పని చేసుకునేందుకు అనుమతిచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలు మాత్రం 100 శాతం సిబ్బందితో రెండు గ్రూపులుగా పని చేయనున్నారు. సరి, బేసి సంఖ్యలో ఉదయం 10 గంటల్నించి 8 గంటల వరకూ మార్కెట్ కొనసాగనుంది. రాత్రి 8 గంటల్నించి ఉదయం 10 గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగనుంది. ఏప్రిల్ 19 నుంచి ఢిల్లీలో పూర్తి స్థాయి లాక్డౌన్ (Lockdown)అమల్లో ఉంది. ఈ నెల 7వ తేదీ నుంచి అన్‌లాక్ (Unlock) ప్రక్రియ కొనసాగనుంది.
Also read: Sputnik v vaccine: స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ఇక సీరమ్ నుంచి ఉత్పత్తి, డీసీజీఐ అనుమతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook