Railway Subsidies: రైల్వే బడ్జెట్‌లో సీనియర్ సిటిజన్, జర్నలిస్టులకు సబ్సిడీ లేనట్టే

Railway Subsidies: రానున్న బడ్జెట్‌లో సీనియర్ సిటిజన్లకు రాయితీపై నమ్మకాలు పోయినట్టే. దేశవ్యాప్తంగా అందరి ఆశలపై కేంద్ర మంత్రి నీళ్లు చల్లేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 12, 2024, 08:26 PM IST
Railway Subsidies: రైల్వే బడ్జెట్‌లో సీనియర్ సిటిజన్, జర్నలిస్టులకు సబ్సిడీ లేనట్టే

Railway Subsidies: భారతీయ రైల్వేలో  కరోనా మహమ్మారి కంటే ముందు సీనియర్ సిటిజన్లు, జర్నలిస్టులకు రాయితీ ఉండేది. కరోనా కాలంలో ఆ రాయితీలన్నింటికీ కేంద్ర ప్రభుత్వం చెక్ చెప్పింది. కరోనా మహమ్మారి తరువాత కూడా ఆ రాయితీలను పునరుద్ధరించే పని చేయలేదు. ఇప్పుడు బడ్జెట్ సందర్బంగా మరోసారి ఆశలు పెట్టుకున్నారంతా.

ఫిబ్రవరి 1వ తేదీ కేంద్ర బడ్జెట్ సమర్పణ ఉంది. చాలామంది ఈ బడ్జెట్‌పై చాలా ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా రైల్వే బడ్జెట్‌పై చాలా ఆశలున్నాయి కొందరికి. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో సీనియర్ సిటిజన్లు, జర్నలిస్టులకు రాయితీని రైల్వే శాఖ తొలగించింది. అప్పట్నించి వాటిని పునరుద్ధరించలేదు. రానున్న బడ్జెట్ ఎన్నికల బడ్జెట్ కావడంతో సీనియర్ సిటిజన్లు, జర్నలిస్టుల రాయితీలను తిరిగి పునరుద్ధరిస్తానే ఆశలు పెట్టాకున్నాయి ఆయా వర్గాలు. అయితే ఆ ఆశలపై నీళ్లు చిమ్మేశారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. జర్నలిస్టులు, వృద్ధులకు గతంలో ఇచ్చిన రాయితీలను పునరుద్ధరిస్తారా అనే ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానంతో అందరి ఆశలపై నీళ్లు చల్లేసినట్టయింది. 

ఇప్పటికే ప్రతి ప్రయాణీకుడు రాయితీ అనుభవిస్తున్నాడని, ప్రత్యేకంగా రాయితీ ఇవ్వాల్సిన అవసరం లేదని పరోక్షంగా సమాధానమిచ్చారు. ప్రతి ప్రయాణీకుడికి రైల్వే శాఖ 55 శాతం వరకూ రాయితీ ఇస్తోందన్నారు. ప్రయాణానికి 100 రూపాయలు ఖర్చవుతుంటే...45 రూపాయలే ఛార్జీల రూపంలో వసూలు చేస్తున్నట్టు చెప్పారు. అంటే 55 శాతం రాయితీ ఇచ్చినట్టే కదా అన్నారు. 

కరోనా సమయంలో తొలగించిన సీనియర్ సిటిజన్లు, జర్నలిస్టుల రాయితీలను తిరిగి పునరుద్ధరించాలంటూ చాలా డిమాండ్లు వచ్చినా రైల్వే శాఖ పట్టించుకోలేదు. కొంతమంది ఎంపీలు అటు లోక్‌సభ, ఇటు రాజ్యసభలో ఇదే అంశాన్ని ప్రశ్నించినా రైల్వే శాఖ సరైన సమాధానం ఇవ్వలేదు. వృద్ధులకు రాయితీలు రద్దు చేయడం ద్వారా 2022-23 ఏడాదిలో రైల్వే 2,242 కోట్లు ఆర్జించింది. 

Also read: Vangaveeti Radha: వంగవీటి రాధా వైసీపీలో చేరడం ఖాయమేనా, పోటీ ఎక్కడ్నించి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News