Karnataka: యడ్యూరప్పకు అమిత్ షా అభయహస్తం..పూర్తికాలం కొనసాగుతారని స్పష్టం

Karnataka: కర్ణాటక ప్రభుత్వ అనిశ్చితికి కేంద్రమంత్రి అమిత్ షా తెర దించారు. ముఖ్యమంత్రి మార్పు విషయంలో వస్తున్న ఊహాగానాలపై క్లారిటీ ఇచ్చారు. 

Last Updated : Jan 18, 2021, 11:24 PM IST
Karnataka: యడ్యూరప్పకు అమిత్ షా అభయహస్తం..పూర్తికాలం కొనసాగుతారని స్పష్టం

Karnataka: కర్ణాటక ప్రభుత్వ అనిశ్చితికి కేంద్రమంత్రి అమిత్ షా తెర దించారు. ముఖ్యమంత్రి మార్పు విషయంలో వస్తున్న ఊహాగానాలపై క్లారిటీ ఇచ్చారు. 

కర్ణాటక ప్రభుత్వం ( Karnataka Government )లో గత కొద్దికాలంగా కొంత అనిశ్చితి నెలకొంది. ఓ దశలో ముఖ్యమంత్రి యడ్యూరప్ప ( Cm Yeddyurappa ) ను పదవి నుంచి దించేందుకు రంగం సిద్ధమైంది. మంత్రివర్గ విస్తరణ ద్వారా తాత్కాలికంగా బ్రేక్ పడినట్టైంది. అయినా ముఖ్యమంత్రి పీఠం మార్పుపై ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. ఏదో సమయంలో కర్ణాటకలో యడ్యూరప్పను పదవి నుంచి దించేస్తారంటూ స్పెక్యులేషన్స్ ప్రారంభమయ్యాయి.  

కర్ణాటక ( Karnataka ) లో పర్యటిస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ( Union minister Amit shah ) ఈ ఊహాగానాలపై క్లారిటీ ఇచ్చారు. ముఖ్యమంత్రి పీఠం మార్పు విషయంలో ఊహాగానాలకు తెర దించారు. ముఖ్యమంత్రి యడ్యూరప్ప పూర్తికాలం పదవిలో కొనసాగుతారని అమిత్ షా ( Amit shah assured cm yeddyurappa for full term ) స్పష్టం చేశారు. కర్ణాటక ప్రజలు, రైతుల అభివృద్ధి విషయంలో యడ్యూరప్ప నిర్లక్ష్యం వహించలేదని అమిత్ షా స్పష్టం చేశారు.  బెళగావిలో ఏర్పాటు చేసిన జనసేవక్‌ ముగింపు సమావేశంలో అమిత్‌షా ప్రసంగించారు. 2014-19 మధ్యకాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( Pm Narendra modi ) ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించారని..వచ్చే ఎన్నికల్లో కూడా కర్ణాటకలో కాషాయజెండానే ఎగురుతుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.

మరోవైపు అసంతృప్త ఎమ్మెల్యేలపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగుళూరులో ఏర్పాటైన కోర్ కమిటీ ( Karnataka Bjp Core Committee ) సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కంటే ఎవరూ గొప్పకాదని..పార్టీకి నష్టం చేకూర్చేవిధంగా  బహిరంగవ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించారు. పార్టీ నిబంధనల్ని ధిక్కరిస్తే క్రమ శిక్షణా చర్యలు తప్పవన్నారు.

Also read: Income Tax Return: ఐటీ రిటర్న్స్‌కు చివరి అవకాశమిదే..లేదంటే జైలు శిక్షే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News