Amit Shah: జయప్రకాశ్‌రెడ్డి లేని లోటు.. చిత్ర పరిశ్రమకు తీర్చలేనిది

టాలీవుడ్‌ ప్రముఖ నటుడు జయప్రకాశ్‌ రెడ్డి (74) మంగళవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. తెలవారుజామున గుండెపోటు రావడంతో జయప్రకాశ్ రెడ్డి (Jaya Prakash Reddy Death ) గుంటూరులో తుదిశ్వాస విడిచారు. 

Last Updated : Sep 8, 2020, 01:18 PM IST
Amit Shah: జయప్రకాశ్‌రెడ్డి లేని లోటు.. చిత్ర పరిశ్రమకు తీర్చలేనిది

Home Minister Amit Shah condoles death of Jaya Prakash Reddy: టాలీవుడ్‌ ప్రముఖ నటుడు జయప్రకాశ్‌ రెడ్డి (74) మంగళవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. తెలవారుజామున గుండెపోటు రావడంతో జయప్రకాశ్ రెడ్డి (Jaya Prakash Reddy Death ) గుంటూరులో తుదిశ్వాస విడిచారు. అయితే జయప్రకాశ్ రెడ్డి అకాల మరణం పట్ల టాలీవుడ్ ప్రముఖులు, ఇరు రాష్ట్రాల నేతలు దిగ్బ్రాంతి వ్యక్తం చేసి ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో జయప్రకాశ్ రెడ్డి అకాల మరణం పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) సైతం ట్విట్టర్ వేదికగా సంతాపం తెలియజేశారు. 

ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఇలా రాశారు. ‘‘గొప్ప ప్రతిభ గల తెలుగు నటుడు శ్రీ జయప్రకాష్ రెడ్డి గారి అకాల మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. విలక్షణ పాత్రలతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవ చిరస్మరణీయం. పరిశ్రమకు ఆయన లేని లోటు తీర్చలేనిది. ఆయన స్థానం భర్తీ చేయలేనిది. ఆయన కుటుంబానికి, అభిమానులకు నా ప్రగాఢ సంతాపం.’’ అంటూ అమిత్ షా ట్విట్ చేశారు. Jaya Prakash Reddy Passed Away: నటుడు జయప్రకాశ్ రెడ్డి కన్నుమూత 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం..
ఇదిలాఉంటే.. జయప్రకాశ్ రెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనేక సినిమాల్లో విభిన్న పాత్రల్లో నటించిన మంచి నటుడిగానే కాకుండా, గొప్ప రంగస్థల నటుడిగా కూడా జయప్రకాశ్ రెడ్డికి ప్రజల్లో అభిమానం ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. Also read: 
Jaya Prakash Reddy Death: జయప్రకాష్‌ రెడ్డి అంత్యక్రియలకు తనయుడు దూరం

Trending News