Unclaimed Amount: జూన్ నుంచి 3 నెలల్లోగా 35 వేల కోట్లను పంచేయనున్న కేంద్రం

Unclaimed Amount: కేంద్ర ఆర్దిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గుడ్‌న్యూస్ అందించారు. త్వరలో దేశవ్యాప్తంగా 35 వేల కోట్ల రూపాయలు వివిధ ఎక్కౌంట్లకు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. దీనికోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 13, 2023, 10:10 AM IST
Unclaimed Amount: జూన్ నుంచి 3 నెలల్లోగా 35 వేల కోట్లను పంచేయనున్న కేంద్రం

Unclaimed Amount: దేశంలోని వివిధ బ్యాంకుల్ని పర్యవేక్షించడం, ఎప్పటికప్పుడు కీలక చర్యలు చేపట్టడం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ఆర్ధిక శాఖ చేస్తుంటాయి. గత కొద్దికాలంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన 35 వేల కోట్ల రూపాయల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఇప్పుడు వేలాది కోట్లు నిరర్ధకంగా పడున్నాయి. ఈ డబ్బులు తమవంటూ క్లెయిమ్ చేసేవాళ్లు లేకపోవడంతో దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వరంగ సంస్థల్నించి ఈ మొత్తం ఆర్బీఐకు ఇటీవలే చేరింది. దీనినే అన్‌క్లెయిమ్డ్ ఎక్కౌంట్స్ అంటారు. ఇలా దేశవ్యాప్తంగా ఆర్బీఐకు చేరిన అన్‌క్లెయిమ్డ్ డబ్బులు 35 వేల కోట్లు. ఇప్పుడీ డబ్బుల్ని సంబంధిత కుటుంబీకుల్ని గుర్తించి వారి ఖాతాలకు చేర్చే బాధ్యతను కేంద్ర ఆర్ధిక శాఖ తీసుకుంది. దీనికి సంబంధించి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. దేశంలోని ప్రతి ఒక్క జిల్లాలో అన్‌క్లెయిమ్డ్ టాప్ 100 ఎక్కౌంట్లను సరిచేసేందుకు 100 రోజుల ప్రత్యేక కార్యక్రమం నడిపిస్తుంది. అంటే రానున్న 100 రోజుల్లో 35 వేల కోట్ల అన్‌క్లెయిమ్డ్ డబ్బులు సంబంధిత కుటుంబ సభ్యులకు చేరనుంది. 100 రోజుల ప్రత్యేక కార్యక్రమం జూన్ 2023 నుంచి ప్రారంభం కానుంది.

పదేళ్ల నుంచి లావాదేవీలు లేకుండా డీయాక్టివ్ అయున్న బ్యాంకు ఎక్కౌంట్లను అన్‌క్లెయిమ్డ్‌గా అభివర్ణిస్తారు. దీర్ఘకాలం పాటు అన్‌క్లెయిమ్డ్‌గా ఉంటే ఆ డబ్బుల్ని సంబంధిత బ్యాంకులు ఆర్బీఐకు తరలిస్తాయి. ఇలాంటి ఎక్కౌంట్ల సంగతి పరిష్కరించేందుకు దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలోని టాప్ 100 బ్యాంకులను గుర్తించాల్సి ఉంది. ఈ ప్రత్యేక కార్యక్రమం 100 రోజులు నడుస్తుంది.

ఆర్బీఐ ఇటీవలే అన్‌‌క్లెయిమ్డ్ ఎక్కౌంట్ల సమస్య పరిష్కరించేందుకు ఒక సెంట్రలైజ్డ్ పోర్టల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ప్రభుత్వ బ్యాంకుల వద్ద ఫిబ్రవరి 2023 వరకూ ఉన్న అన్‌క్లెయిమ్డ్ నగదు 35 వేల కోట్లు. ఎక్కౌంట్ల పరంగా చూస్తే ఈ సంఖ్య 10.24 కోట్ల ఎక్కౌంట్లు.

అన్‌క్లెయిమ్డ్ ఎక్కౌంట్ అంటే 

వివిధ రకాల ఎక్కౌంట్లను క్లోజ్ చేయకుండా వదిలేసినవి లేదా క్లెయిమ్ చేయకుండా ఉన్న మెచూర్డ్ ఫిక్స్డ్ డిపాజిట్లు ఇవన్నీ అన్‌క్లెయిమ్డ్ ఖాతాల పరిధిలో వస్తాయి. ఎక్కౌంట్ హోల్డర్లు లేదా డిపాజిట్ల హోల్డర్లు మరణించినప్పుడు నామినీ లేదా కుటుంబసభ్యులు ఆ మొత్తాన్ని క్లెయిమ్ చేయకపోవడం కూడా చాలా సందర్భాల్లో జరుగుతుంటుంది. ఇలాంటి వాటిని అన్‌క్లెయమ్డ్ ఎక్కౌంట్లుగా పరిగణిస్తారు. 

ఈ అన్‌క్లెయిమ్డ్ డబ్బుల విషయంలో ఓ కేంద్రీకృత పోర్టల్ ఏర్పాటు చేస్తామని ఆర్బీఐ గతంలో కూడా తెలిపింది. దీనివల్ల ఎక్కౌంట్ హోల్డర్లు, డిపాజిటర్ల కుటుంబీకులు లేదా నామినీలు వివిధ బ్యాంకుల్లో పడి ఉన్న అన్‌క్లెయిమ్డ్ ఎక్కౌంట్ల గురించి తెలుసుకోగలరు.

Also read: New Skoda Kodiaq: స్కోడా నుంచి మార్కెట్లోకి కొత్త SUV.. ధర తెలిస్తే షాక్ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News