Union cabinet: ఏపీ కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్‌కు ఆమోదముద్ర లభించింది. కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ వివరాల్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు.
కేంద్ర మంత్రివర్గ సమావేశం ( Union cabinet meet ) లో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి కీలకమైన అంశానికి ఆమోద ముద్ర లభించింది. దేశంలో మొత్తం మూడు పారిశ్రామిక కారిడార్లకు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్..ఆకాశ్ మిస్సైల్ ( Akash missile ) ఎగుమతిని అనుమతించింది. వీటితో పాటు మరి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఏపీ ( Ap ) లోని కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్ ( Krishnapatnam industrial corridor ), కర్ణాటక తుంకూరు పారిశ్రామిక కారిడార్‌లతో పాటు గ్రేటర్ నోయిడా ( Greater noida )లోని మల్టీ మోడల్ లాజిస్టిక్స్ హబ్ మరియు మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశంలోని మూడు పారిశ్రామిక కారిడార్లను 7 వేల 725 కోట్లతో కేంద్ర నిర్మించనుందని మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. పారిశ్రామిక కారిడార్ల నిర్మాణం ద్వారా 2.8 లక్షలమందికి ఉపాధి లభించనుందని కేంద్ర మంత్రి వెల్లడించారు.
ఏపీలోని కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్ ప్రతిపాదిత వ్యయం 2 వేల 139 కోట్లుగా అంచనా వేశారు. కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్‌తో పెద్ద ఎత్తున ఉపాధితో పాటు..ఉత్పత్తి రంగంలో పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు అవకాశముందని మంత్రి ప్రకాశ్ జవదేకర్ ( Union minister Prakash javadekar ) చెప్పారు. కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్ వల్ల లాజిస్టిక్స్ ఖర్చు తగ్గడంతో పాటు నిర్వహణ సామర్ధ్యం పెరుగుతుంది.
Also read: Ban on international flights: ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌పై నిషేధాన్ని పొడిగించిన కేంద్రం