ఆధార్ సైట్‌లో కొత్త 'అప్‌డేట్' ఫీచర్

ఆధార్ సైట్‌లో కొత్త 'అప్‌డేట్' ఫీచర్

Last Updated : Jun 7, 2018, 08:08 AM IST
ఆధార్ సైట్‌లో కొత్త 'అప్‌డేట్' ఫీచర్

యూఐడీఏఐ బుధవారం రోజు కొత్తగా ఆధార్ 'అప్‌డేట్ హిస్టరీ' ఫీచర్‌ను సైట్ బీటా వర్షన్‌లో అందుబాటులోకి తెచ్చింది. దీంతో అడ్రస్, పేరు, ఫోన్ నంబర్ తదితర వివరాలు మార్చుకుంటే.. ఆ వివరాలు మార్చామని, అవి ఇంకా అప్‌డేట్ కాలేదని తెలిపేలా అవసరం ఉన్న హిష్టరీ డాక్యుమెంట్లను పొందొచ్చు. పాత వివరాలతో సమస్యలు ఎదుర్కుంటూ సమాచారం మార్చినా.. అప్‌డేట్ జరిగేందుకు పట్టే సమయంలో వచ్చే ఇబ్బందులకు ఇది పరిష్కారంగా నిలువనుంది.

ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలంటే, ఆధార్ కార్డు కలిగి ఉన్న వారు(యూజర్) యూఐడీఏఐ వెబ్సైట్‌కు వెళ్లి ఆధార్ 'అప్‌డేట్ హిస్టరీ' పై క్లిక్ చేయాలి. యూజర్, ఆధార్ నంబర్ లేదా వర్చువల్ ఐడీ, సెక్యూరిటీ కాప్చాను నింపేసేటప్పుడు ఒక పేజీ ఓపెన్ అవుతుంది. వన్ టైం పాస్ వర్డు అందుకున్న తరువాత అప్ డేట్ హిస్టరీ కనిపిస్తుంది. దీనిని మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు.

'ఆధార్ అప్‌డేట్ హిస్టరీ ఫీచర్ వలన ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుంది. ఉద్యోగాలకు, పాఠశాల ప్రవేశాలు, వివిధ సేవలు మొదలైన వాటి కోసం గత రెండు లేదా మూడు సంవత్సరాల అడ్రస్ ఇవ్వండి అని అధికారులు అడుగుతుంటారు. అలాంటి సందర్భాల్లో అప్‌డేట్ హిస్టరీ ఉపయోగపడుతుంది' అని అధికారులు పేర్కొన్నారు.

Trending News