Udaipur Tailor murder: రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో ఘోరం జరిగింది. పట్టపగలు ఓ మనిషిని దారుణంగా చంపేశారు. సోషల్ మీడియా పోస్టులే హత్యకు కారణమని పోలీసులు భావిస్తుండగా..హత్యానంతరం ఉదయ్‌పూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత నూపూర్ శర్మ చేసిన వ్యాఖ్యల పర్యవసానం ఇంకా ఆరలేదు. నూపుర్ శర్మకు వ్యతిరేకంగా, మద్దతుగా సోషల్ మీడియా పోస్టులు అధికమౌతున్నాయి. ఈ క్రమంలో నూపుర్ శర్మకు మద్దతుగా ఉదయ్‌పూర్‌లోని ఒక టైలర్ కన్హయ్యా లాల్ చేసిన వ్యాఖ్యలు..అతన్ని బలి తీసుకున్నాయి. నూపుర్ శర్మకు మద్దతుగా కన్హయ్యా లాల్ సోషల్ మీడియాలో షేర్ చేయడాన్ని వ్యతిరేకించిన ఇద్దరు వ్యక్తులు అతనిపై దాడి చేశారు. పట్టపగలే అతని టైలరింగ్ షాపులోనే దాడి చేసి చంపేశారు. దాడికి పాల్పడిన ఇద్దరిలో ఒకరిని మొహమ్మద్ రియాజ్‌గా పోలీసులు గుర్తించారు.
పదునైన కత్తితో కన్హయ్యా లాల్‌పై దుండగులు దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు. ఒకరు దాడి చేస్తుంటే మరొకరు ఈ ఘటనను మొబైల్‌లో రికార్డు చేశారని తెలుస్తోంది. ఈ ఘటన పర్యవసానం ఉదయ్‌పూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికంగా ఉన్న వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. నగరంలో 24 గంటల వరకూ ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. కన్హయ్యాలాల్ హత్య వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
మరోవైపు రాష్ట్రంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోకుండా ప్రభుత్వం, పోలీసులు అప్రమత్తమయ్యారు. అన్ని జిల్లా ఎస్పీలకు అలర్ట్ జారీ చేసింది ప్రభుత్వం. పోలీసుల బలగాల్ని రంగంలో దింపారు. ఇద్దరు ఏడీజీపీలు, అదనంగా ఒక ఎస్పీతో పాటు 6 వందల మంది పోలీసు బలగాల్ని నగరంలో మొహరించారు. ఉదయపూర్ హత్యోదంతంతో పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని..శాంతిభద్రతలకు విఘ్నం కలగకుండా పరిస్థితిని గమనిస్తున్నామని లా అండ్ ఆర్డర్ ఏడీజీ తెలిపారు.
అత్యంత దారుణంగా ఓ వ్యక్తిపై దాడి చేసి చంపడమే కాకుండా..వీడియో తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో రాజస్థాన్ రాష్ట్రమంతటా కలకలం రేగింది. ఈ ఘటనలో నిందితుల్ని గుర్తించామని..పట్టుకునేందుకు పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయని ఉదయ్‌పూర్ ఎస్పీ వెల్లడించారు.
మరోవైపు ఉదయ్‌పూర్ హత్యోదంతపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందించారు. జరిగిన హత్యను తీవ్రంగా ఖండించారు. అత్యంత దారుణమైన ఘటనని..ఇదేమీ చిన్న విషయం కాదని సీఎం తెలిపారు. నిందితుల్ని క్షమించేది లేదని స్పష్టం చేశారు. ఈ హత్యలో పాలుపంచుకున్న నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని..ప్రజలంతా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.
It's a sad & shameful incident. There's tense atmosphere in the nation today. Why don't PM & Amit Shah ji address the nation? There is tension among people. PM should address the public&say that such violence won't be tolerated & appeal for peace: Rajasthan CM on Udaipur murder pic.twitter.com/rkX0VRJPk0
— ANI (@ANI) June 28, 2022
సిగ్గుతో తలదించుకోవల్సిన ఘటన అని..దేశమంతా ఉద్రిక్త పరిస్థితి నెలకొందని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చెప్పారు. ఈ ఘటనపై హోంమంత్రి అమిత్ షా, ప్రధాని మోదీ ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు..హింసను సహించేదని లేదని..ప్రజలంతా సంయమనంగా ఉండాలని ప్రధాని మోదీ పిలుపు ఇవ్వాల్సి ఉందన్నారు. మరోవైపు ఈ ఘటనపై బీజేపీ స్పందించింది ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమని ఖండించింది.
Also read: Today Weather: ఏపీ, తెలంగాణ సహా దేశమంతా విస్తారంగా వర్షాలు, మరో 24 గంటలు తప్పదంటున్న ఐఎండీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి