Twitter vs Koo: దేశంలో ఇప్పుడు ట్విట్టర్ వార్ నడుస్తోంది. రైతు ఉద్యమం కాస్తా ట్విట్టర్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వంగా మారినట్టుంది. విదేశీ యాప్ ఎందుకు..స్వదేదీ ఉంది కదా అనే ఆలోచన వచ్చింది. ట్విట్టర్‌కు పోటీగా దేశీయ యాప్ కూను భారత ప్రభుత్వం ప్రమోట్ చేస్తోంది. ఈ ప్రమోషన్ కూడా ట్విట్టర్‌లోనే కావడం విశేషం.
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ( Twitter ). అభిప్రాయాల్ని నిర్భయంగా చెప్పగలిగే ఒక వేదిక. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులంతా ఎక్కువగా ట్విట్టర్ వేదికనే వినియోగిస్తుంటారు. దేశంలో నడుస్తున్న రైతు ఆందోళన ( Farmers protest )కు ట్విట్టర్ సాక్షిగా ప్రపంచ ప్రముఖుల మద్దతు లభిస్తోంది. అటు గణతంత్ర దినోత్సవాన జరిగిన ట్రాక్టర్ ర్యాలీ ( Tractor rally ), హింసాత్మక ఘటనల వెనుక ట్విట్టర్ సాక్షిగా విద్వేషం రెచ్చగొట్టే హ్యాష్‌ట్యాగ్స్ కారణమనేది కేంద్ర ప్రభుత్వ ఆరోపణ. అటువంటి ట్విట్టర్ ఖాతాల్ని తొలగించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ( Central government ) ట్విట్టర్‌కు నోటీసులు పంపింది. ట్విట్టర్ ఇచ్చిన సమాధానంపై కేంద్ర ఐటీ శాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో అత్యంత శక్తివంతమైన మైక్రో బ్లాక్ ప్లాట్‌ఫామ్ అయిన ట్విట్టర్ ఏకఛత్రాధిపత్యాన్ని ప్రదర్శిస్తూ హద్దులు మీరుతుందనే విమర్శలు డోనాల్డ్ ట్రంప్ ( Donald trump )ఎక్కౌంట్ బ్యాన్ చేశాక ఎక్కవయ్యాయి. ఇండియాకే కాదు ప్రపంచంలోని కొన్ని దేశాలతో ట్విట్టర్‌కు వైరం నడుస్తోంది.
అందుకే ఇప్పుడు ట్విట్టర్‌కు పోటీగా దేశీయంగా తయారైన కూ ( Koo App ) ను భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ( Union minister piyush goel ) కూ ( Koo ) లో చేరినట్టు ప్రకటించారు. అటు రైతు ఆందోళనకు వ్యతిరేకిగా ముద్రపడిన కంగనా రనౌత్ ( Kangana ranaut ) కూడా కూలో చేరింది. కూ మేడిన్ ఇండియా. కూ అకౌంట్ ఓపెన్ చెయ్యాలంటే ఓటీపీ అవసరం. ట్విట్టర్‌కు ఓటీపీ అవసరం లేదు. కూ యాప్ హిందీ, తెలుగు, కన్నడ, బెంగాలీ, తమిళం, మలయాళం, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, ఒడియా, అస్సామీ ఇతర భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది. భారత ప్రభుత్వం కోసం అప్రమేయ రాధాకృష్ణ, మయాంక్ బిదావత్కాలు పది నెలల క్రితమే కూని రూపొందించారు. మోదీ ( Modi ) తన మన్‌కీ బాత్‌లో వారిద్దరినీ ప్రశంసించారు కూడా. ఇప్పుడిప్పుడు కూ దేశానికి అలవాటవుతోంది. కూ ని గూగుల్ ప్లే నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ప్రజా ఉద్యమాలని ప్రభుత్వం సహిస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక ప్రజా ఉద్యమాలను మాత్రం సీరియస్‌గా తీసుకుంటుంది. అయితే ట్విట్టర్‌కు ఈ ఉద్యమాలతో సంబంధం ఉండదు. ఒక పరిమితి వరకు భావ వ్యక్తీకరణకు ప్లాట్‌ఫామ్ అవుతుంది. వ్యక్తీకరణ మితి మీరితే అకౌంట్‌లు బ్లాక్ చేస్తుంది. ఆన్ లైన్ ప్రజాస్వామ్య ( Online Democracy ) రాజ్యం లాంటిది ట్విట్టర్. ఆ ప్రజాస్వామ్యం దుర్వినియోగం అవుతున్నట్లు అనిపించినప్పుడు పోటీగా తామూ ఒక ట్విట్టర్‌ను పెట్టుకోవాలన్న ఆలోచన ప్రభుత్వాలకు కలగడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఇప్పుడు మన దేశం ప్రారంభించిన కూ కూడా ఒక ప్రత్యామ్నాయ ట్విట్టర్ వంటిదే.
అందుకే కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఐ యామ్ నౌ ఇన్ కూ ( Iam now in koo ) అని ఒక ట్వీట్ పెట్టారు. కూ అంటే ట్విట్టర్‌కు పోటీగా మన ఇండియన్ యాప్ ( Koo is made in india app ). మేడ్ ఇన్ ఇండియా. ప్రౌడ్ ఆఫ్ ఇండియా. అయినా సరే ట్విట్టర్ ట్విట్టరే కదా..కూ లో చేరిన సంగతిని కూడా కేంద్రమంత్రి ట్విట్టర్ సాక్షిగా చెప్పడం.
I am now on Koo.
Connect with me on this Indian micro-blogging platform for real-time, exciting and exclusive updates.
Let us exchange our thoughts and ideas on Koo.
📱 Join me: https://t.co/zIL6YI0epM pic.twitter.com/REGioTdMfm
— Piyush Goyal (@PiyushGoyal) February 9, 2021
Also read: APY Scheme: 18 ఏళ్లు నిండాయా, ఈ స్కీమ్‌లో చేరితే ప్రతినెలా చేతికి డబ్బులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook