Tourists in Mahabaleshwar | మహరాష్ట్రలో ఉన్న మహాబళేశ్వర్ ప్రాంతానికి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది పర్యాటకులు వెళ్తుంటారు. అందమైన కొండల మధ్య హిల్ స్టేషన్ అనుభూతిని సొంతం చేసుకుంటారు. సతారా జిల్లాల్లో ఉన్న ఈ ప్రాంతం అందాలను చూసి బ్రిటిష్ వాళ్లు ఇక్క పర్యాటకాన్ని ప్రోత్సాహించారు. బ్రిటిష్ కాలంలో బాంబే రాష్ట్రంలో మహాబళేశ్వర్ జిల్లా వేసవి రాజధానిగా ఉండేది. ఈ కొండ ప్రాంతానికి దాని సొగసులను చూడటానికే కాదు అక్కడ లభించే స్ట్రాబెర్రీ రుచులను చూడటానికి కూడా దూరదూరం నుంచి పర్యాటకులు వస్తుంటారు.
ALSO READ | Doppelgänger: మనుషులను పోలిన మనుషులు అంటాం కదా.. వీళ్లే వాళ్లు..
అయితే ఈ సారి స్ట్రాబెర్రీలు సొంతం చేసుకోవాలి అనుకుంటే.. వాటి రుచిని అస్వాదించాలి అనుకుంటే అది ఖరీదైన విషయంగా మారనుంది. స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్, స్ట్రాబెర్రీ క్రీమ్ వెల కాస్త పెరిగింది. మహాబళేశ్వర్ ( Mahabaleshwar ) స్ట్రాబెర్రీలకు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు, అంతకు మించిన మార్కెట్ ఉంటుంది. అయితే కరోనావల్ల ( Coronavirus ) వాటి ధర ఈ సారి భారీగా పెరగింది. ఒకప్పుడు కిలో స్ట్రాబెర్రీ రూ.200 కి దొరికేది. ఇప్పుడు అది పెరిగి రూ.800కు లభిస్తోంది. అక్కడి వస్తున్న పర్యాటకులు ధర విని వెనక్కి తగ్గుతున్నారట.
Also Read | ఇలా చేయకపోతే మీ Gmail ఎకౌంట్ Deactivate అవుతుంది!
ఇంతలా ధర పెరగడానికి కూడా ఒక కారణం ఉంది. స్ట్రాబెర్రీ ( Strawberries ) విత్తనాలను బయటి దేశం నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సారి కోవిడ్-19 ( Covid-19) వల్ల దిగుమతికి అనుమతి లభించలేదు. దాంతో చాలా పంట సాగు విస్తీర్ణం భారీగా తగ్గింది. ఫలింగా స్ట్రాబెర్రీ ధరలు కొండనెక్కాయి.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR