ఐదో రోజూ పెరిగిన బంగారం ధర.. వెండి ధర జిగేల్

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. కరోనా వైరస్ భయాల నేపథ్యంలో జనతా కర్ఫ్యూ, పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్‌లు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి.

Last Updated : Mar 26, 2020, 07:17 AM IST
ఐదో రోజూ పెరిగిన బంగారం ధర.. వెండి ధర జిగేల్

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. కరోనా వైరస్ భయాల నేపథ్యంలో జనతా కర్ఫ్యూ, పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్‌లు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. జ్యువెలర్ల విక్రయాలు, దేశీయ మార్కెట్‌లో డిమాండ్ రావడంతో నేటి (మార్చి 25న) బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగినా.. వెండి సైతం బంగారాన్ని అనుసరించింది. ఏపీలో టెన్త్ పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ మార్కెట్లలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.310 పెరిగింది.  24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.43,620కి చేరుకుంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం రూ.373 పెరగడంతో 10 గ్రాముల ధర రూ.40,073కి జంప్ అయింది. Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు పెరిగాయి. బంగారం ధర రూ.310 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.42,060కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర సైతం అంతే పెరిగింది. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.40,860కి జంప్ అయింది. శుభవార్త.. ఐటీ రిటర్న్స్ తుది గడువు పొడిగించిన కేంద్రం

కాగా, బంగారం ధరలు పెరగగా వెండి సైతం పసిడినే అనుసరించింది. నిన్న మార్కెట్లో భారీగా తగ్గిన వెండి ధర నేటి మార్కెట్లో భారీగా పెరిగింది. బులియన్ మార్కెట్‌లో బుధవారం 1 కేజీ వెండి రూ.1140 మేర తగ్గడంతో నలభై వేల మార్కు చేరుకుంది. దీంతో 1కేజీ వెండి ధర రూ.41,020 అయింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలోనూ ఒక కేజీ వెండి ధర రూ.41,020గా ట్రేడ్ అవుతోంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

హాలీవుడ్ బుట్టబొమ్మ Bold Photos

మనసున్న మారాజు.. ప్రకాష్ రాజ్

Trending News